లావుగా ఉన్నాడన్నారు.. సర్ఫరాజ్ ఖాన్ ఎంత స్లిమ్ అయ్యాడో చూశారా?

by Harish |

టీమ్ ఇండియా యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఫిట్‌నెస్‌‌పై ఫోకస్ పెట్టాడు.

లావుగా ఉన్నాడన్నారు.. సర్ఫరాజ్ ఖాన్ ఎంత స్లిమ్ అయ్యాడో చూశారా?
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఫిట్‌నెస్‌‌పై ఫోకస్ పెట్టాడు. కేవలం రెండు నెలల్లోనే సర్ఫరాజ్ ఖాన్ ఏకంగా 17 కిలోలు తగ్గాడు. బొద్దుగా ఉండే అతను చాలా స్లిమ్‌గా మారిపోయాడు. తాజాగా జిమ్‌లో దిగిన ఫొటోలను సర్ఫరాజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఆ ఫొటోలు చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆ ఫొటోల్లో ఉంది సర్ఫరాజ్ ఖానే అనే అంతలా బరువు తగ్గాడు. 27 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్‌లో ప్రతిభ‌‌‌కు కొదవలేదు. బ్యాటింగ్‌పై ఎవరికీ అనుమానాలు లేవు. ఇంగ్లాండ్‌తో అరంగేట్ర సిరీస్‌లోనే తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో మూడు హాఫ్ సెంచరీలు చేశాడు. ఆ తర్వాత న్యూజిలాండ్‌పై రెండో టెస్టులో(150 రన్స్) భారీ శతకం బాదాడు.

అయినప్పటికీ అధిక బరువు కారణంగా అతనిపై విమర్శలు వచ్చాయి. దేశవాళీలో అద్భుతమైన రికార్డు కలిగిన సర్ఫరాజ్ బరువు కారణంగానే అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇవ్వడం ఆలస్యమైందని చాలా మంది అభిప్రాయం. ప్రస్తుతం కూడా బొద్దుగా ఉండటం వల్ల అవకాశాలు చేజారుతున్నాయి. ఇంగ్లాండ్‌ టూరుకు అతన్ని పక్కనపెట్టిన విషయం తెలిసిందే. సాయి సుదర్శన్, కరుణ్ నాయర్‌లను ఎంపిక చేశారు. సర్ఫరాజ్‌ను ఎంపిక చేయకపోవడానికి కారణం చెప్పకపోయినా అధిక బరువు కూడా ఓ రీజనే అంటూ వార్తలు వచ్చాయి. భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌ సహా పలువురిని సర్ఫరాజ్‌ను ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యం కలిగింది.

డైట్ మొత్తం మార్చేసి..

తిరిగి భారత జట్టులోకి తిరిగి రావాలని పట్టుదలతో ఉన్న సర్ఫరాజ్ బరువు తగ్గడంపై దృష్టి పెట్టాడు. జిమ్‌లో గంటల కొద్ది చెమటోడ్చాడు. తన డైట్‌ను పూర్తిగా మార్చేసుకున్నాడు. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. సర్ఫరాజ్ రోటీ, రైస్ పూర్తిగా తినడం మానేశాడట. కీర దోశ, సలాడ్స్, గ్రీన్ వెజిటేబుల్, బ్రోకోలీ ఎక్కువగా తీసుకుంటున్నాడు. రెండు నెలలుగా బిర్యానీని మానేసిన అతను దాని స్థానంలో అవకాడో తింటున్నాడట. అయితే, ప్రొటీన్ కోసం నాన్ వెజ్ మానలేదు. ఫిష్, గ్రిల్డ్ చికెన్, ఉడకబెట్టిన చికెన్, గుడ్లను తీసుకుంటున్నాడు. అలాగే, రోజుకోసారి మొలకెత్తిన విత్తనాలు తీసుకుంటున్నాడు. క్రమశిక్షణగా డైట్ ఫాలో అయ్యాడు కాబట్టే రెండు నెలల్లోనే 17 కిలోలు తగ్గాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


Next Story