- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Wimbledon 2025 : వింబుల్డన్ క్వీన్ స్వైటెక్.. ఫైనల్‌లో సంచలన ప్రదర్శనతో చరిత్ర
వింబుల్డన్‌కు కొత్త యువరాణి వచ్చింది. ఉమెన్స్ సింగిల్స్ టైటిల్‌ను స్వైటెక్ ఎగరేసుకుపోయింది.

దిశ, స్పోర్ట్స్ : వింబుల్డన్‌కు కొత్త యువరాణి వచ్చింది. పొలాండ్ టెన్నిస్ క్రీడాకారిణి ఇగా స్వైటెక్ నయా చాంపియన్‌గా అవతరించింది. ఉమెన్స్ సింగిల్స్ టైటిల్‌ను ఎగురేసుకపోయింది. తొలిసారిగా ఫైనల్‌కు చేరుకున్న ఎడిషన్‌లోనే విజేతగా నిలవడం విశేషం. ఫైనల్‌లో అమెరికా క్రీడాకారిణి అనిసిమోవాను చిత్తు చేసి మొదటిసారిగా వింబుల్డన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. టోర్నీలో దూకుడుగా ఆడిన ఆమె ఫైనల్‌లోనూ అదే జోరు కొనసాగించింది. అనిసిమోవాను 6-0, 6-0 తేడాతో మట్టికరిపించింది. ఫైనల్‌లో స్వైటెక్‌దే పూర్తి ఆధిపత్యం. అమెరికా క్రీడాకారిణి కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. ఆమె ఒక్క గేము కూడా గెలవలేదంటే స్వైటెక్ ఏ విధంగా ఆధిపత్యం ప్రదర్శించిందో అర్థం చేసుకోవచ్చు. కేవలం 57 నిమిషాల్లోనే స్వైటెక్ రెండు సెట్లను నెగ్గి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. స్వైటెక్ 3 ఏస్‌లు, 10 విన్నర్లు బాదితే.. అనిసిమోవా ఒక్క ఏస్ కూడా సంధించకపోగా 8 విన్నర్లే కొట్టింది. అంతేకాకుండా, 5 డబుల్ ఫౌల్ట్స్, 28 అనవసర తప్పిదాలతో అనిసిమోవా మూల్యం చెల్లించుకుంది. తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌లో అడుగుపెట్టిన ఆమెకు నిరాశ తప్పలేదు.
స్వైటెక్ చరిత్ర
ఫైనల్‌లో సంచలన ప్రదర్శనతో స్వైటెక్ చరిత్ర సృష్టించింది. రెండు సెట్లలోనే ఫైనల్ నెగ్గిన ఆమె వింబుల్డన్‌లో ఓపెన్ ఎరాలో ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా నిలిచింది. అలాగే, 1911 తర్వాత వింబుల్డన్‌లో రెండు సెట్లలో ఫైనల్ గెలవడం 114 ఏళ్లలో ఇదే తొలిసారి. టోర్నీలో స్వైటెక్ ఏకపక్ష విజయాలతో అదరగొట్టింది. రెండో రౌండ్‌లో మినహా అన్ని మ్యాచ్‌లను కేవలం రెండు సెట్లలోనే గెలవడం టోర్నీలో ఆమె ఆధిపత్యాన్ని తెలియజేస్తుంది. వింబుల్డన్ టైటిల్ గెలవడం స్వైటెక్‌కు ఇదే మొదటిసారి. మొత్తంగా 6వ గ్రాండ్‌స్లామ్. ఇంతకుముందు ఆమె నాలుగుసార్లు ఫ్రెంచ్ ఓపెన్(2020, 2022, 2023, 2024) టైటిల్స్, ఓ సారి యూఎస్ ఓపెన్(2022) టైటిల్ గెలిచింది.






