Paris Olympics: నీరజ్ చోప్రా 'గోల్డ్' గెలిస్తే.. ఫ్యాన్స్ కు భారీ రివార్డ్

by Geesa Chandu |   (  Updated:2024-08-07 11:55:11  IST  )

భారత క్రికెటర్ రిషబ్ పంత్ ప్రస్తుతం శ్రీలంక లో మూడు మ్యాచ్ ల సిరీస్ ఆడుతున్నాడు. ఈ సిరీస్ లో మూడో నిర్ణయాత్మక మ్యాచ్ నేడు ఉంది.

Paris Olympics: నీరజ్ చోప్రా గోల్డ్ గెలిస్తే.. ఫ్యాన్స్ కు భారీ రివార్డ్
X

దిశ, వెబ్ డెస్క్: భారత క్రికెటర్ రిషబ్ పంత్ ప్రస్తుతం శ్రీలంక లో మూడు మ్యాచ్ ల సిరీస్ ఆడుతున్నాడు. ఈ సిరీస్ లో మూడో నిర్ణయాత్మక మ్యాచ్ నేడు ఉంది. అయితే వన్డే సిరీస్ లోని తొలి రెండు మ్యాచుల్లో పంత్ కు అవకాశం లభించలేదు. అయితే ప్లేయింగ్ 11 లో ఇప్పుడు ఉన్నాడు.

వివరాల్లోకి వెళ్తే.. రిషబ్ పంత్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేసాడు. అందులో అభిమానులకు భారీ రివార్డులను ప్రకటించాడు. పారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా బంగారు పతకం గెలిస్తే.. అభిమానులకు రూ. 1 లక్ష ఇస్తానని ట్వీట్ చేసాడు. ఇప్పుడది వైరల్ గా మారింది. అయితే నీరజ్ చోప్రా ఆగస్టు 8 రాత్రి బంగారు పతకం కోసం బరిలోకి దిగనున్నాడు. నీరజ్ తో పాటు మొత్తం 12 మంది అథ్లెట్లు స్వర్ణం కోసం పోటీపడనున్నారు. ఈ పన్నెండు మందిలో పాకిస్తాన్ కి చెందిన అర్షద్ నదీమ్ పేరు కూడా ఉంది. అయితే ప్రతీసారి జరుగుతున్న పోటీలో నీరజ్ తో మాత్రం గట్టి పోటీని ఇవ్వలేకపొతున్నాడు.

Next Story