- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ICC షాకింగ్ నిర్ణయం.. యూఎస్‌ఏ క్రికెట్ సభ్యత్వంపై వేటు
by Kema Shiva Kumar |
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA) క్రికెట్ సభ్యత్వాన్ని సస్పెండ్ చేస్తూ మంగళవారం రాత్రి జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా తక్షణమే ఆర్డర్స్ అమల్లోకి వస్తుందని ఐసీసీ ప్రతినిధులు వెల్లడించారు. ఈవెంట్ల నిర్వహణ వైఫల్యం, ఐసీసీ పాలసీలను అమలు చేయడంలో యూఎస్‌ఏ క్రికెట్ బోర్డు విఫలమైనట్లుగా ఐసీసీ తీవ్ర ఆరోపణలు చేసింది. అమెరికన్ క్రికెట్ బోర్డులోని వివిధ వాటాదారుల నుంచి వచ్చిన అనేక లిఖితపూర్వక ఫిర్యాదులపై చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తాజా నిర్ణయంతో ఐసీసీ ఈవెంట్లతో పాటు ఇక యూఎస్‌ఏ జట్టు క్రికెట్ ఆడలేని పరిస్థితి వచ్చింది.
Next Story






