ఐసీసీ కీలక నిర్ణయం.. మహిళల వరల్డ్ కప్-2029లో 10 జట్లకు ఆమోదం

by Harish |

మహిళల వన్డే వరల్డ్ కప్‌ను విస్తరించాలని ఐసీసీ నిర్ణయించింది.

ఐసీసీ కీలక నిర్ణయం.. మహిళల వరల్డ్ కప్-2029లో 10 జట్లకు ఆమోదం
X

దిశ, స్పోర్ట్స్ : మహిళల వన్డే వరల్డ్ కప్‌ను విస్తరించాలని ఐసీసీ నిర్ణయించింది. ఇప్పటివరకు మహిళల వరల్డ్ కప్‌లో 8 జట్లే పాల్గొన్నాయి. ఇటీవల జరిగిన ప్రపంచకప్‌లోనూ 8 జట్లే ఆడాయి. కానీ 2029లో జరిగే ప్రపంచకప్‌లో 10 జట్లు పాల్గొనబోతున్నాయి. ఈ విషయాన్ని ఐసీసీ శుక్రవారం వెల్లడించింది. ‘మహిళల వరల్డ్ కప్‌ను 10 జట్లకు విస్తరించడానికి ఐసీసీ బోర్డు అంగీకరించింది. మహిళల ప్రపంచకప్‌ను దాదాపు 3 లక్షల మంది వీక్షించారు. ఇది ఏ మహిళల క్రికెట్ ఈవెంట్‌లోనైనా రికార్డు. అలాగే, టీవీ, డిజిటల్‌లో కూడా వ్యూయర్‌షిప్‌లో కొత్త రికార్డులను సృష్టించింది. ఇండియాలో దాదాపు 500 మిలియన్ల వ్యూయర్స్ వీక్షించారు.’అని ఐసీసీ తెలిపింది. ఇటీవల ముగిసిన వరల్డ్ కప్‌లో 31 మ్యాచ్‌లు జరిగాయి. 2029 వరల్డ్ కప్‌లో జట్లను 10కి పెంచడంతో మ్యాచ్‌ల సంఖ్య 48కి పెరగనుంది.

మహిళల క్రికెట్ కమిటీలోకి మిథాలీ రాజ్

తాజాగా మహిళల క్రికెట్ కమిటీ సభ్యుల నియామకాన్ని ఐసీసీ ఆమోదించింది. భారత దిగ్గజ క్రీడాకారిణి మిథాలీ రాజ్‌ను ఐసీసీ కమిటీలోకి తీసుకుంది. అలాగే, భారత మహిళల జట్టు క్రికెట్ జట్టు హెడ్ కోచ్ అమోల్ మజుందార్‌ను కూడా మెంబర్‌గా నియమించింది. ఆష్లే డి సెల్వ(శ్రీలంక), బెన్ సాయర్(ఆస్ట్రేలియా), చార్లెట్ ఎడ్వర్డ్స్(ఇంగ్లాండ్) ఇతర సభ్యులుగా ఉన్నారు.


Next Story