- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Women's World Cup : వరుణుడి ఖాతాలో మరో మ్యాచ్.. పాక్, కివీస్ మ్యాచ్ వర్షార్పణం
శ్రీలంకలోని కొలంబోలో పడుతున్న వర్షాలు మహిళల ప్రపంచకప్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

దిశ, స్పోర్ట్స్ : శ్రీలంకలోని కొలంబోలో పడుతున్న వర్షాలు మహిళల ప్రపంచకప్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. టోర్నీలో మరో మ్యాచ్ వరుణుడి ఖాతాలోకి వెళ్లింది. శనివారం జరగాల్సిన పాకిస్తాన్, న్యూజిలాండ్ మ్యాచ్ కూడా వర్షార్పణమైంది. ప్రపంచకప్‌లో వర్షం కారణంగా రద్దైన నాలుగో మ్యాచ్ ఇది. ఇంతకుముందు శ్రీలంక-ఆస్ట్రేలియా, శ్రీలంక- న్యూజిలాండ్, ఇంగ్లాండ్-పాకిస్తాన్ మ్యాచ్‌లు రద్దైన విషయం తెలిసిందే. టాస్ ఓడి పాక్ ముందుగా బ్యాటింగ్‌కు దిగగా 25 ఓవర్ల తర్వాత భారీ వర్షం కురిసింది. ఆ సమయానికి పాక్ 92/5తో నిలిచింది. ఎంతకీ వరుణుడు కరుణించకపోవడంతో మ్యాచ్ నిలిచిపోయింది. ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది. ఇంకా గెలుపు ఖాతా తెరవని పాక్ 2 పాయింట్లతో అట్టడుగు స్థానంలో ఉంది. కివీస్ 4 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. పాక్, న్యూజిలాండ్ మ్యాచ్‌లో ఫలితం తేలకపోవడంతో సౌతాఫ్రికాకు కలిసొచ్చింది. ఆ జట్టు సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. 8 పాయింట్లతో దక్షిణాఫ్రికా రెండో స్థానంలో ఉన్నది. ఆస్ట్రేలియా కూడా సెమీస్‌కు చేరుకున్న విషయం తెలిసిందే.






