- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ICC Rules: క్రికెట్ లో కొత్త రూల్స్..ఇక వాళ్లకు పండగే
వన్డే క్రికెట్ లో( OdiCricket) కీలక మార్పులు చేసేందుకు ఐసీసీ ( ICC) రంగం సిద్ధం చేసింది. ప్రతి మూడు నెలలకు ఒకసారి కొత్త

దిశ, వెబ్ డెస్క్ : వన్డే క్రికెట్ లో( OdiCricket) కీలక మార్పులు చేసేందుకు ఐసీసీ ( ICC) రంగం సిద్ధం చేసింది. ప్రతి మూడు నెలలకు ఒకసారి కొత్త రూల్స్ తీసుకువచ్చే ఐసీసీ... ఇప్పుడు వన్డే క్రికెట్ లో సరికొత్త మార్పులకు పూనుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా రెండు బంతుల నిబంధన అమలు చేస్తున్న అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్... ఇప్పుడు.. ఆ రూల్స్ మార్చేందుకు రంగం సిద్ధం చేసింది.
బౌలర్లకు అనుకూలంగా ఉండేలా కొత్త రూల్స్ తీసుకురాబోతోంది. నేషనల్ మీడియా కథనం ప్రకారం.. వన్డే క్రికెట్ లో జులై మాసం నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి. ఈ రూల్ ప్రకారం మ్యాచ్ ప్రారంభం నుంచి 34 వ ఓవర్ వరకు రెండు బంతులను వినియోగించుకోవచ్చు. ఆ తర్వాత 35వ ఓవర్ నుంచి యాభై ఓవర్ వరకు... ఆ రెండు బంతుల్లో ఏదో ఒక బంతిని వినియోగించుకుంటే సరిపోతుంది.
దీనివల్ల బౌలర్లకు చాలా బెనిఫిట్ అవుతుంది. గతంలో ఈ రూల్ లేకపోవడం వల్ల ఒక బంతి పాత బడటం.. కారణంగా రివర్స్ స్వింగ్ ( Reverse swing) బౌలర్లకు లభించేది కాదు. కానీ ఇప్పుడు రెండు బంతులు వాడుకునే ఛాన్స్ రావడంతో రివర్స్ స్వింగ్ అద్భుతంగా బౌలర్లు వేస్తారు. దానివల్ల బౌలర్లకు చాలా మేలు జరుగుతుంది. అటు బ్యాట్స్మెన్ దూకుడును కట్టడి చేయవచ్చు. ఈ కొత్త రూల్స్ జూలై నుంచి ప్రారంభం కానున్నాయి. కేవలం వన్డే క్రికెట్లో మాత్రమే అమలు చేస్తారు.






