ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: బౌలింగ్‌లో రెండో స్థానం దక్కించుకున్న దీప్తి శర్మ

by Dishanational2 |
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: బౌలింగ్‌లో రెండో స్థానం దక్కించుకున్న దీప్తి శర్మ
X

దిశ, స్పోర్ట్స్: ఐసీసీ తాజాగా వెల్లడించిన మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో భారత స్పిన్నర్ దీప్తి శర్మ బౌలర్ల జాబితాలో రెండో స్థానం దక్కించుకుంది. ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్‌లోనూ ఎటువంటి మార్పు లేకుండా నాలుగో స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో దీప్తి మెరుగైన ప్రదర్శన కనబర్చింది. బౌలింగ్‌లో 2/24, 2/22తో సత్తాచాటింది. దీంతో 723 పాయింట్ల రేటింగ్ సాధించి.. దక్షిణాఫ్రికాకు చెందిన నోంకులులెకో మ్లాబా (722)ను అధిగమించింది. దీంతో నాలుగు స్థానాలు ఎగబాకి రెండో ర్యాంక్‌కు చేరుకుంది. ఇక, ఆస్ట్రేలియా కొత్త కెప్టెన్ అలిస్సా హీలీ 636 రేటింగ్‌తో బ్యాటింగ్‌లో మళ్లీ టాప్ 10లోకి దూసుకెళ్లింది. స్మృతి మంధాన తన నాలుగో ర్యాంకును నిలబెట్టుకుంది.


Next Story