- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అజాద్ కశ్మీర్ వ్యాఖ్యలు.. సనా మిర్ కు ఐసీసీ బిగ్ షాక్ !
ఆజాద్ కశ్మీర్ అంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సనా మిర్ ( Sana Mir ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: మహిళల ప్రపంచ కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో కశ్మీర్ వివాదం తెరపైకి వచ్చింది. ఆజాద్ కశ్మీర్ అంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సనా మిర్ ( Sana Mir ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వరల్డ్ కప్ 2025 టోర్నమెంటులో భాగంగా పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య అక్టోబర్ రెండవ తేదీన అంటే దసరా రోజున మ్యాచ్ జరిగింది. ఇందులో పాకిస్తాన్ అత్యంత దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో కామేంటేటర్ గా సనా మిర్ వ్యవహరించారు.
అయితే ఈ సందర్భంగా నటాలియా అనే ప్లేయర్.. ఆజాద్ కశ్మీర్ కు చెందిన అమ్మాయి... లాహోర్ కు వచ్చి క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తోందని సనా మిర్ కామెంట్రీ చేసి వివాదానికి తెర లేపారు. ఆజాద్ కశ్మీర్ అంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ అన్నట్లు. అయితే ఈ అంశంపై టీమిండియా అభిమానులతో పాటు బిసిసిఐ చాలా సీరియస్ గారు ఉన్నట్లు తెలుస్తోంది.
వరల్డ్ కప్ జరుగుతున్న సమయంలో ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై ఐసీసీ కి కూడా ఫిర్యాదు చేసిందట బిసిసిఐ. దీంతో కామేంటేటర్ గా వ్యవహరించిన సనా మిర్ పై యాక్షన్ తీసుకునేందుకు ఐసీసీ రంగం సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపై లైఫ్ లో కామెంట్రేటర్ గా... ఉండకుండా చేసేలా యాక్షన్స్ తీసుకునేందుకు ఐసీసీ ప్లాన్ చేస్తోందట. మరి ఈ అంశంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. క్లిక్






