- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, స్పోర్ట్స్ : టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ మ్యాచ్‌లు భారత్‌లోనే జరుగుతాయని ఐసీసీ తేల్చి చెప్పింది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ భారత్‌లో టీ20 ప్రపంచకప్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) నిరాకరిస్తోంది. తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని ఐసీసీని కోరింది. దీనిపై చర్చించేందుకు ఐసీసీ బుధవారం అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ మీటింగ్‌లో బంగ్లాకు గట్టి షాక్ తగిలింది. బీసీబీ అభ్యర్థనను ఐసీసీ బోర్డు తిరస్కరించింది. ఆఖరి నిమిషంలో పాకిస్తాన్ మద్దతు ఇచ్చినా ఫలితం దక్కలేదు. 16 మంది సభ్యులు ఉన్న బోర్డులో బీసీబీకి మద్ధతుగా రెండు ఓట్లే వచ్చాయి. ఒకటి బంగ్లాది.. మరోటి పాక్‌ది అని అర్థమవుతుంది.
అయితే, బుధవారంలోగానే ప్రపంచకప్ ఆడతారో?లేదో? చెప్పాలని బీసీబీకి ఐసీసీ ఇప్పటికే డెడ్‌లైన్ విధించింది. కానీ, బంగ్లా బోర్డు ఇంకా తమ నిర్ణయాన్ని వెల్లడించలేదు. తాజా మీటింగ్ తర్వాత బీసీబీకి మరో రోజు గడువు ఇచ్చింది. 24 గంట్లలో తమ నిర్ణయాన్ని వెల్లడించాలని అల్టిమేటం జారీ చేసింది. అలాగే, బంగ్లా మ్యాచ్‌లను భారత్‌లోనే జరుగుతాయని ఐసీసీ స్పష్టం చేసింది. అన్ని భద్రతా అంచనాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఇండియాలో బంగ్లా ప్లేయర్లకు, అధికారులకు ఎలాంటి ముప్పు ఉండదని హామీ ఇచ్చింది. టోర్నీకి మరో రెండు వారాలే సమయం ఉన్నందున వేదికలను మార్చడం కుదరని తేల్చి చెప్పింది. మరి, బంగ్లా ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. బంగ్లా తప్పుకుంటే ఆ టీమ్ స్థానంలో స్కాట్లాండ్ వరల్డ్ కప్ ఆడే అవకాశాలు ఉన్నాయి.






