భారత్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్‌..? కుదరదని తేల్చేసిన ఐసీసీ!

by Phanindra |

భారత్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్‌ నిర్వహించాలని బీసీసీఐ అనుకుంది. కానీ దీనికి ఐసీసీ నో చెప్పేసిందట!

భారత్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్‌..? కుదరదని తేల్చేసిన ఐసీసీ!
X

దిశ, స్పోర్ట్స్: డబ్ల్యూటీసీ ఫైనల్ నిర్వహణ విషయంలో బీసీసీఐకి ఐసీసీ గట్టి షాకిచ్చింది. ఇప్పటి వరకు జరిగిన మూడు డబ్ల్యూటీసీ ఫైనల్స్‌ ఇంగ్లండ్‌లోనే జరిగాయి. 2021లో సౌతాంప్టన్, 2023లో ఓవల్, 2025లో లార్డ్స్ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్స్ జరిగాయి. అయితే ఇది కరెక్ట్ కాదని, డబ్ల్యూటీసీ ఫైనల్ వంటి కీలక మ్యాచ్‌కు ఆతిథ్య వేదికను టెస్టు ప్లేయింగ్ దేశాల్లో మారుస్తూ ఉండాలని రోహిత్ శర్మ, ప్యాట్ కమిన్స్ వంటి స్టార్ క్రికెటర్లతోపాటు కొన్ని క్రికెట్ బోర్డులు కూడా డిమాండ్ చేస్తున్నాయి.


ఈ క్రమంలోనే 2027లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్‌ను నిర్వహించేందుకు బీసీసీఐ ఆసక్తిచూపిస్తున్నట్లు వార్తలొచ్చాయి. అయితే ఈ డిమాండ్‌ను ఐసీసీ తోసిపుచ్చినట్లు సమాచారం. వచ్చే మూడు డబ్ల్యూటీసీ ఫైనల్స్.. అంటే 2027, 2029, 2031లో కూడా ఈ కీలక మ్యాచ్‌ను ఇంగ్లండ్‌లోనే నిర్వహించాలని ఐసీసీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. భారీగా జరిగే టికెట్ అమ్మకాలు, లాజిస్టికల్ సౌలభ్యాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ వర్గాలు చెప్తున్నాయి. జులై నెలలో సింగపూర్ వేదికగా జరిగే ఐసీసీ వార్షిక సమావేశంలో ఈ నిర్ణయంపై ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది.

Next Story