- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ICC Ranks: టాప్-5 బ్యాటర్లలో భారత్ జోరు.. ముగ్గురు స్టార్ ప్లేయర్లకు చోటు
by Kema Shiva Kumar |
అంతర్జాతీయ క్రికెట్ మండలి విడుదల చేసిన వన్డే బ్యాటింగ్ ర్యాంకుల్లో ముగ్గురు భారత ఆటగాళ్లు సత్తా చాటారు.

X
దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకుల్లో భారత బ్యాటర్లు సత్తా చాటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్-5 బ్యాటర్ల జాబితాలో ఏకంగా ముగ్గురు మన కుర్రాళ్లే ఉండటం. వరుసగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ తమ అద్భుతమైన ఫామ్‌తో ఈ ఘనత సాధించారు. ఇక న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్ వన్డే ఫార్మాట్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఇటీవలి కాలంలో ఆయన కనబరిచిన నిలకడైన ప్రదర్శన అతడిని నంబర్ 1 స్థానంలో నిలబెట్టింది. భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లీ రెండో స్థానంలో కొనసాగుతుండగా, కెప్టెన్ రోహిత్ శర్మ నాలుగో ర్యాంకులో యువ సంచలనం శుభ్‌మన్ గిల్ ఐదో ర్యాంకులో నిలిచారు.
టాప్-5 వన్డే బ్యాటర్లు ఇలా..
డారిల్ మిచెల్ (న్యూజిలాండ్)
విరాట్ కోహ్లీ (భారత్)
ఇబ్రహీం జద్రాన్ (అఫ్గానిస్థాన్)
రోహిత్ శర్మ (భారత్)
శుభ్‌మన్ గిల్ (భారత్)
బౌలర్లలో కుల్‌దీప్..
బౌలింగ్ విభాగంలో భారత్ నుంచి చైనామన్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ టాప్-10లో చోటు దక్కించుకున్నారు. అతడు తొమ్మిదో (9) ర్యాంకులో నిలిచి టీమ్ ఇండియా తరఫున మెరుగైన బౌలర్‌గా నిలిచారు. అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ బౌలింగ్ విభాగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. టీ20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత భారత జట్టు ఇప్పటి వరకు ఎలాంటి వన్డే మ్యాచ్‌లు ఆడలేదు. అయితే, ఈ మధ్య కాలంలో బంగ్లాదేశ్, పాకిస్థాన్ జట్లు మాత్రమే వన్డే సిరీస్‌లు ఆడినప్పటికీ, మన ఆటగాళ్ల పాయింట్లు, పాత ప్రదర్శనల ఆధారంగా వారి ర్యాంకులు స్థిరంగా కొనసాగుతున్నాయి.
Next Story






