- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ICC Rankings : రోహిత్ vs కోహ్లీ.. వన్డేల్లో నం.1 ర్యాంక్ కోసం పోటీ
భారత స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు వన్డేల్లో నం.1 ర్యాంక్ కోసం పోటీపడుతున్నారు.

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు వన్డేల్లో నం.1 ర్యాంక్ కోసం పోటీపడుతున్నారు. ఐసీసీ బుధవారం రిలీజ్ వన్డే ర్యాంకింగ్స్‌లో రోహిత్ నం.1 బ్యాటర్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. మరోవైపు, కోహ్లీ రెండు స్థానాలు అధిగమించాడు.న్యూజిలాండ్ బ్యాటర్ మిచెల్, అఫ్గాన్‌కు చెందిన ఇబ్రహీం జద్రాన్‌లను వెనక్కినెట్టాడు. దీంతో 2వ ర్యాంక్‌కు దూసుకొచ్చిన అతను అగ్రపీఠానికి చేరువయ్యాడు. రోహిత్ 781 రేటింగ్ పాయింట్లు కలిగి ఉండగా కోహ్లీ ఖాతాలో 773 పాయింట్స్ ఉన్నాయి. ఇద్దరి మధ్య కేవలం 8 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉండటం గమనార్హం. 2021 ఏప్రిల్‌లో వన్డేల్లో టాప్ పొజిషన్ కోల్పోయాడు కోహ్లీ. టెస్టు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్, కోహ్లీ వన్డేల్లో అదరగొడుతున్నారు. ఆస్ట్రేలియా టూరుతోపాటు ఇటీవల సౌతాఫ్రికాతో సిరీస్‌లో సత్తాచాటారు. కోహ్లీ వరుసగా రెండు సెంచరీలు చేయగా మూడో వన్డేలో హాఫ్ సెంచరీ చేశాడు. తొలి రెండు వన్డేల్లో నిరాశపర్చిన రోహిత్ ఆఖరి మ్యాచ్‌లో 75 రన్స్‌తో రాణించాడు. బ్యాటింగ్‌లో టాప్-10లో నలుగురు భారత ప్లేయర్లు ఉండటం విశేషం. రోహిత్, కోహ్లీలతోపాటు 5వ స్థానంలో గిల్, 10వ స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. కేఎల్ రాహుల్ రెండు స్థానాలు ఎగబాకి 12వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.
బౌలర్లలో 3వ స్థానానికి కుల్దీప్
భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా తన ర్యాంక్‌ను మెరుగుపర్చుకున్నాడు. మూడు స్థానాలు వెనక్కినెట్టి 3వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. సౌతాఫ్రికాతో సిరీస్‌లో సత్తాచాటిన కుల్దీప్ 9 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అఫ్గాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ నం.1 బౌలర్‌గా కొనసాగుతున్నాడు. యువ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ 29 స్థానాలు ఎగబాకి 66వ స్థానానికి చేరుకున్నాడు.






