ఆ ఒక్క పిచ్ మాత్రమే ‘వెరీ గుడ్’.. ఇంగ్లాండ్‌లోని పిచ్‌లకు రేటింగ్ ఇచ్చిన ఐసీసీ

by Harish |

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఇటీవల ముగిసిన ఐదు టెస్టుల సిరీస్ 2-2తో డ్రా అయిన విషయం తెలిసిందే.

ఆ ఒక్క పిచ్ మాత్రమే ‘వెరీ గుడ్’.. ఇంగ్లాండ్‌లోని పిచ్‌లకు రేటింగ్ ఇచ్చిన ఐసీసీ
X

దిశ, స్పోర్ట్స్ : భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఇటీవల ముగిసిన ఐదు టెస్టుల సిరీస్ 2-2తో డ్రా అయిన విషయం తెలిసిందే. ఆఖరిదైన ఐదో టెస్టులో భారత్ సంచలన విజయం సాధించి సిరీస్‌ను సమం చేసింది. ఐదు టెస్టులు ఐదు మైదానాల్లో జరిగాయి. ఐసీసీ శుక్రవారం నాలుగు పిచ్‌‌లకు రేటింగ్‌లు ఇచ్చింది. అందులో ఒక్క పిచ్‌కు మాత్రమే హయ్యెస్ట్ రేటింగ్ దక్కింది. తొలి టెస్టు జరిగిన లీడ్స్‌లోని హెడింగ్లీకి ఐసీసీ ‘వెరీ గుడ్’ రేటింగ్ ఇచ్చింది. ఔట్ ఫీల్డ్‌కూ అదే రేటింగ్ దక్కింది. ఆ మ్యాచ్‌లో భారత్ భారీ ఓటమిని చవిచూసింది. ఇక, మిగతా మూడు పిచ్‌లు హయ్యెస్ట్ రేటింగ్ పొందడంలో విఫలమయ్యాయి. రెండో టెస్టుకు వేదికైన ఎడ్జ్‌బాస్టన్, మూడో టెస్టు జరిగిన లార్డ్స్, నాలుగో టెస్టుకు ఆతిథ్యమిచ్చిన ఓల్డ్ ట్రాఫొర్డ్ పిచ్‌లు ‘సంతృప్తికరం’ రేటింగ్ పొందాయి. అయితే, మూడు స్టేడియాల ఔట్ ఫీల్డ్‌లకు మాత్రం వెరీ గుడ్ రేటింగ్ దక్కింది. ప్రతిష్టాత్మక స్టేడియమైన లార్డ్స్ పిచ్‌కు వెరీ గుడ్ రేటింగ్ దక్కకపోవడం గమనార్హం. ఐదో జట్టు జరిగిన ఓవల్ స్టేడియం పిచ్‌‌కు ఐసీసీ ఇంకా రేటింగ్ ఇవ్వలేదు.


Next Story