వన్డేల్లో నం.1గానే భారత్.. వెస్టిండీస్ వరల్డ్ కప్ ఆశలు సంక్లిష్టం

by Harish |

వన్డేల్లో టీమిండియా నం.1 జట్టుగా కొనసాగుతోంది.

వన్డేల్లో నం.1గానే భారత్.. వెస్టిండీస్ వరల్డ్ కప్ ఆశలు సంక్లిష్టం
X

దిశ, స్పోర్ట్స్ : వన్డేల్లో టీమిండియా నం.1 జట్టుగా కొనసాగుతోంది. ఐసీసీ ఆదివారం రిలీజ్ చేసిన వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ 124 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని కాపాడుకుంది. మరే ఇతర జట్టు దరిదాపుల్లో కూడా లేకపోవడంతో భారత జట్టు ర్యాంక్‌కు ఇప్పట్లో ఢోకా లేదు. న్యూజిలాండ్(109), ఆస్ట్రేలియా(109) వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో ఓటమితో శ్రీలంక 4వ స్థానం నుంచి 5వ ర్యాంక్‌కు పడిపోయింది. దీంతో పాక్ ఒక్క స్థానం ఎగబాకి 4వ స్థానానికి చేరుకుంది. శ్రీలంకపై విజయంతో బంగ్లాదేశ్ కూడా 10వ స్థానం నుంచి 9వ ర్యాంక్‌కు వెళ్లింది. వెస్టిండీస్ ఒక్క స్థానాన్ని కోల్పోయి 10వ ర్యాంక్‌కు దిగజారింది. దీంతో విండీస్ వన్డే వరల్డ్ కప్-2027 అర్హత ఆశలు ప్రమాదంలో పడ్డాయి. టాప్-8లో ఉంటేనే ఈ మెగా టోర్నీకి నేరుగా క్వాలిఫై అవ్వొచ్చు. 2027 మార్చి 31 లోపు కరేబియన్ జట్టు తమ ర్యాంక్‌ను మెరుగుపర్చుకోవాలి. లేదంటే వన్డే వరల్డ్ కప్‌కు అర్హత సాధించడానికి క్వాలిఫయర్స్ ఆడాల్సి ఉంటుంది. రెండుసార్లు చాంపియన్ అయిన విండీస్ 2023లో జరిగిన వన్డే వరల్డ్ కప్‌కు అర్హత సాధించని విషయం తెలిసిందే.


Next Story