- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాలుగు రోజుల టెస్టులు.. డబ్ల్యూటీసీ ఫైనల్ టైంలోనే ఓకే చెప్పిన ఐసీసీ?
భవిష్యత్తులో నాలుగు రోజుల టెస్టులు నిర్వహించాలని ఐసీసీ భావిస్తోంది. డబ్ల్యూటీసీ ఫైనల్ టైంలోనే ఈ నిర్ణయానికి జై షా అంగీకరించాడట.

దిశ, స్పోర్ట్స్: భవిష్యత్తులో టెస్టులు కేవలం నాలుగు రోజులే నిర్వహించేందుకు ఐసీసీ ఒప్పుకుంది. ఐసీసీ వర్గాల సమాచారం ప్రకారం, డబ్ల్యూటీసీ ఫైనల్ సమయంలో జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఐసీసీ చైర్మన్ జై షా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఎక్కువ టైం తీసుకుంటాయనే కారణంతోనే చాలా చిన్న దేశాలు టెస్టు సిరీసులు ఆడేందుకు ఆసక్తి చూపడం లేదని, అదే టెస్టులను నాలుగు రోజులకు కుదిస్తే మూడు వారాల్లో మూడు టెస్టుల సిరీసులు ఆడే అవకాశం ఉంటుందని ఐసీసీ వర్గాలు చెప్తున్నాయి.
అయితే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, భారత్‌కు మాత్రం ఐదు రోజులు ఆడే ఐదు సిరీసులు నిర్వహించేందుకు అనుమతిస్తున్నారట. వీటిలో యాషెస్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ, కొత్తగా పేరు మార్చిన ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ తదితర సిరీసులు ఉంటాయి. అయితే ఇలా నాలుగు రోజుల టెస్టులు నిర్వహించేందుకు 2017లోనే ఐసీసీ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత జింబాబ్వే, ఐర్లాండ్‌తో ఇంగ్లండ్ నాలుగు రోజుల టెస్టులు ఆడింది.
ఐదు రోజుల టెస్టుల వల్ల 2025-2027 డబ్ల్యూటీసీ సైకిల్‌లో చాలా దేశాలు రెండు టెస్టుల సిరీసులు పెట్టుకుంటున్నాయి. అదే టెస్టులను 4 రోజులకు కుదిస్తే అదే సమయంలో మూడు టెస్టుల సిరీసులు పెట్టుకోవచ్చు. ఈ ఆలోచనతోనే 2027-2029 డబ్ల్యూటీసీ సైకిల్‌లో నాలుగు రోజుల టెస్టులు ఆడించాలని ఐసీసీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.






