- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ICC: బీసీసీఐకి ఐసీసీ స్ట్రాంగ్ వార్నింగ్.. అసలు కారణం ఇదే!
పాకిస్థాన్ (Pakistan) వేదికగా జరగబోతున్న ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) ఈవెంట్ బీసీసీఐ (BCCI), ఐసీసీ (ICC) మధ్య వివాదాన్ని రాజేసింది.

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్థాన్ (Pakistan) వేదికగా జరగబోతున్న ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) ఈవెంట్ బీసీసీఐ (BCCI), ఐసీసీ (ICC) మధ్య వివాదాన్ని రాజేసింది. టీమిండియా (Team India) ప్లేయర్స్ జెర్సీల మీద ఆతిథ్య దేశం పేరు ముద్ర వేసే విషయంలో బీసీసీఐ (BCCI), పీసీబీ (PCB) మధ్య వివాదం తలెత్తింది. ఐసీసీ నిబంధన మేరకు ఆటగాళ్ల జెర్సీలపై ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy)తో పాటు ఆతిథ్య దేశం పేరు ఖచ్చితంగా ఉండాలి. కానీ పాక్ పేరును ముద్రించడానికి బీసీసీఐ (BCCI) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
ఈ క్రమంలోనే వివాదంలో ఐసీసీ (ICC) కల్పించుకుని బీసీసీఐకి ఓ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చినట్లుగా విదేశీ మీడియాలో కథనాలు వస్తున్నాయి. జెర్సీపై టోర్నమెంట్ లోగో ముద్రించడం ప్రతి జట్టు యొక్క బాధ్యత అని ఐసీసీ చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రతి జట్టు ఈ నిబంధనను పాటించాలని సూచించింది. అదేవిధంగా టీమిండియా (Team India) జెర్సీపై, ప్లేయర్స్ కిట్‌పై ఆతిథ్య దేశం పేరుతో ఛాంపియన్స్ ట్రోఫీ Champions Trophy) లోగో ఉండాలని.. ఒకవేళ భారత్ ఆ నిబంధనను పాటించని పక్షంలో సీరియస్ యాక్షన్ తీసుకుంటామని ఓ ఐసీసీ అధికారి హెచ్చరించట్లుగా వార్తలు ఇంగ్లీష్ మీడియాలో షికారు చేస్తున్నాయి.






