- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ICC: సంబరాల్లో ఉన్న టీమిండియా ప్లేయర్‌కు భారీ షాక్
టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్‌లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. న్యూజిలాండ్ బ్యాటర్ మిచెల్ పట్ల టీమిండియా స్టా్ర్ బౌలర్ అర్హదీప్ సింగ్ అనుచితంగా ప్రవర్తించారు. దీంతో తాజాగా అర్షదీప్‌కు ఐసీసీ షాకిచ్చింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతనికి మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించడమే కాకుండా, ఒక డెమెరిట్ పాయింట్‌ను కూడా కేటాయించింది.
అసలేం జరిగింది..?
అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో, న్యూజిలాండ్ లక్ష్య ఛేదనలో ఉండగా 11వ ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అర్షదీప్ తన బౌలింగ్ ఫాలో-త్రూలో బంతిని అందుకుని వేగంగా వికెట్ల వైపు విసిరాడు. అయితే ఆ బంతి నేరుగా వెళ్లి కివీస్ బ్యాటర్ డారిల్ మిచెల్ ప్యాడ్లకు బలంగా తగిలింది. బంతి తగిలిన వెంటనే అర్షదీప్ కనీసం క్షమాపణ కూడా చెప్పకుండా తన బౌలింగ్ మార్క్ వైపు వెనుదిరగడంతో మిచెల్ అసహనానికి గురయ్యాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగే సూచనలు కనిపించడంతో, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వెంటనే జోక్యం చేసుకుని మిచెల్‌ను శాంతింపజేశారు. అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ కూడా అర్షదీప్‌ను పిలిచి హెచ్చరించారు.
ఐసీసీ నిబంధనల ఉల్లంఘన..
ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.9 ప్రకారం.. అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇతర ఆటగాళ్లపైకి లేదా వారి దరిదాపుల్లోకి ప్రమాదకరంగా బంతిని లేదా ఇతర క్రీడా సామాగ్రిని విసరడం నేరం. ఇది లెవల్-1 నిబంధన ఉల్లంఘన కిందకు రావడంతో మ్యాచ్ రిఫరీ ఈ చర్యలు తీసుకున్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లేతో అర్షదీప్ మాట్లాడుతూ.. "అది కావాలని చేసింది కాదు. నేను విసిరిన బంతి అనుకోకుండా రివర్స్ స్వింగ్ అయ్యి అతనికి తగిలింది. అందుకే తర్వాత వెళ్లి మిచెల్‌కు సారీ చెప్పాను" అని వివరణ ఇచ్చాడు. అనంతరం డ్రెస్సింగ్ రూమ్ బయట కూడా మిచెల్, అర్ష్‌దీప్ ఒకరినొకరు పలకరించుకుని కరచాలనం చేసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.






