బీసీసీఐ అప్పీల్‌.. ఇండోర్‌ పిచ్‌ రేటింగ్‌ను మార్చిన ఐసీసీ!

by Disha Web Desk 13 |
బీసీసీఐ అప్పీల్‌.. ఇండోర్‌ పిచ్‌ రేటింగ్‌ను మార్చిన ఐసీసీ!
X

దిశ, వెబ్‌డెస్క్: ఐసీసీ ఇండోర్‌ పిచ్‌ రేటింగ్‌ను సవరించింది. 'పూర్‌' నుంచి 'బిలో యావరేజ్‌'కు మార్చింది. భారత్‌, ఆస్ట్రేలియా మూడో టెస్టుకు ఉపయోగించిన ఈ పిచ్‌పై అనూహ్యమైన టర్నేమీ లేదని వెల్లడించింది. బీసీసీఐ ఫిర్యాదు చేయడంతో మ్యాచ్‌ ఫుటేజీని పరిశీలించి ఈ నిర్ణయం తీసుకుంది. బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా మూడో టెస్టును ఇండోర్‌లో నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌ కేవలం ఏడు సెషన్లే జరిగింది.

రెండు జట్ల స్పిన్నర్లు దుమ్మురేపడంతో బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. మొత్తానికి ఆస్ట్రేలియా విజయం సాధించిగా.. టీమ్‌ఇండియా ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. అయితే మ్యాచ్‌ రిఫరీ క్రిస్‌ బ్రాడ్‌ ఈ పిచ్‌కు 'పూర్‌' రేటింగ్‌ ఇచ్చాడు. మూడు డీ మెరిట్‌ పాయింట్లు ప్రకటించాడు. ఇప్పుడు దానిని ఐసీసీ ఒక డీ మెరిట్‌ పాయింట్‌కు తగ్గించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం.. ఐదు అంతకన్నా ఎక్కువ డీమెరిట్‌ పాయింట్లు వస్తే ఆ పిచ్‌ను 12 నెలల పాటు నిషేధిస్తారు.

Next Story