- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ICC Champions Trophy : కమిన్స్ వ్యాఖ్యలపై దుమారం..యూటర్న్ !
ఛాంపియన్ ట్రోఫీ(ICC Champions Trophy 2025)లో ఒకే వేదిక(దుబాయ్) పై ఆడటం భారత్(INDIA) జట్టుకు బాగా కలిసొస్తుందంటూ ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్(Australia Captain Pat Cummins) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

దిశ, వెబ్ డెస్క్ : ఛాంపియన్ ట్రోఫీ(ICC Champions Trophy 2025)లో ఒకే వేదిక(దుబాయ్) పై ఆడటం భారత్(INDIA) జట్టుకు బాగా కలిసొస్తుందంటూ ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్(Australia Captain Pat Cummins) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. టీమిండియా, ఎస్ఆర్ హెచ్(SRH) ఫ్యాన్స్ కమిన్స్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తాను అలా అనలేదంటూ ప్యాట్ కమిన్స్ మరో పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత టీమ్ పాకిస్థాన్ వెళ్లకపోవడంపై ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
గాయంతో ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన ఆసీస్ సారథి కమిన్స్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఛాంపియన్ ట్రోఫీ నిర్వహణపై మట్లాడుతూ టీమ్ ఇండియా ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్ వేదికగా నిర్వహించడం భారత్‌కు బాగా కలిసొస్తుందన్నాడు. అంతేకాదు ఇండియా ఛాంపియన్ కప్ గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యానించాడు. హైబ్రిడ్ పద్ధతిలో ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతోందని..'పాక్ వెళ్లేందుకు భారత్ నిరాకరించిన నేపథ్యంలో భారత జట్టు ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో నిర్వహించడం మంచిదేనని..అయితే ఒకే వేదికపై అన్ని మ్యాచ్ లు ఆడిన జట్టుకు ఎక్కువ ప్రయోజనం ఉంటుందని కమిన్స్ కామెంట్ చేశాడు.
భారత్ టీమ్ ఇప్పటికే చాలా పటిష్టంగా ఉందని.. దుబాయ్‌లోనే టోర్నీ మొత్తం ఆడటం వారికి కలిసొస్తుందని...కప్ కొట్టే అవకాశాలు టీమిండియాకు ఎక్కువడగా ఉన్నాయన్నాడు. కమిన్స్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో దుమారం రేపాయి. కమిన్స్ వ్యాఖ్యలపై భారత ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. ఎస్ఆర్ హెచ్ అభిమానులు సైతం ప్యాట్ కమిన్స్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. ట్రోఫీలో భారత జట్టు విజయాలను తక్కువ చేసి మాట్లాడాడని మండిపడుతున్నారు. ఈ టోర్నీ ఆడకున్నా అసీస్ క్రికెటర్ భారత్ పై విషం చిమ్మడం మానలేదంటూ మండిపడుతున్నారు.
దీంతో వెంటనే రియాక్ట్ అయిన ప్యాట్ కమిన్స్ .. నిజంగా తాను ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టాడు. ఆస్ట్రేలియాకు చెందిన ఓ మీడియా ఛానల్ ప్రచురించిన వార్త వల్లే తప్పుడు సంకేతాలు వెళ్లాయని క్లారిటీ ఇచ్చాడు. కమిన్స్ తాజా పోస్టు వైరల్ గా మారింది.






