ICC Champions Trophy : హైబ్రిడ్ మోడల్‌కు గ్రీన్ సిగ్నల్.. బీసీసీఐకి ఐసీసీ ఇచ్చిన ఝలక్ ఇదే..!

by Sathputhe Rajesh |

చాంపియన్స్ ట్రోఫీ-2025ను హైబ్రిడ్ మోడల్ లోనే నిర్వహించాలని ఐసీసీ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ICC Champions Trophy : హైబ్రిడ్ మోడల్‌కు గ్రీన్ సిగ్నల్.. బీసీసీఐకి ఐసీసీ ఇచ్చిన ఝలక్ ఇదే..!
X

దిశ, స్పోర్ట్స్ : చాంపియన్స్ ట్రోఫీ-2025ను హైబ్రిడ్ మోడల్ లోనే నిర్వహించాలని ఐసీసీ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. గురువారం రాత్రి జైషా నేతృత్వంలోని ఐసీసీ , అసోసియేషన్ మెంబర్లతో భేటీ అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం . అయితే 2027 వరకు ఐసీసీ నిర్వహించే టోర్నమెంట్‌లను ఈ మోడల్‌లోనూ నిర్వహించాలని నిర్ణయించినట్లు జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. పాకిస్తాన్‌లో పర్యటించేది లేదని బీసీసీఐ తేల్చిచెప్పిన తర్వాత పీసీబీ తొలుత హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించలేదు. తర్వాత 2031 వరకు జరిగే ఐసీసీ ఈవెంట్లలో హైబ్రిడ్ మోడల్‌ కొనసాగించాలని డిమాండ్ పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా ఐసీసీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. 2027వరకు ఐసీసీ నిర్వహించే అన్నీ ఈవెంట్లకు హైబ్రిడ్ మోడల్‌కు సమ్మతించినట్లు తెలుస్తోంది. ‘హైబ్రిడ్ మోడల్‌లో చాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహించేందుకు సూత్రప్రాయంగా ఐసీసీ అంగీకరించింది. యూఏఈని హైబ్రిడ్ మోడల్‌కు వేదికగా నిర్ణయించాం. భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లు దుబాయిలో నిర్వహిస్తాం. ఐసీసీ ప్రతినిధులు ఈ ప్రతిపాదనకు అంగీకరించారు.’అని ఐసీసీ వర్గాలు తెలిపాయి. 2025 నుంచి 2027 మధ్య భారత్‌లో మహిళల వన్డే వరల్డ్ కప్ జరగనుంది. శ్రీలంకతో ఉమ్మడిగా 2026 పురుషుల టీ20 వరల్డ్ కప్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఒక వేళ ఐసీసీ నిర్ణయమే ఫైనల్ అయితే టీ20 వరల్డ్‌కప్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లను నేరుగా మైదానానికి వెళ్లి వీక్షించే అవకాశాన్ని కోల్పోనున్నారు.

Next Story