- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపటి నుంచే చాంపియన్స్ ట్రోఫీ టికెట్లు సేల్.. ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చాంపియన్స్ ట్రోఫీ మరికొద్ది రోజుల్లో ప్రారంభంకానుంది.

దిశ, స్పోర్ట్స్ : క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చాంపియన్స్ ట్రోఫీ మరికొద్ది రోజుల్లో ప్రారంభంకానుంది. వచ్చే నెల 19 నుంచి టోర్నీకి తెరలేవనుంది. ఈ ఐసీసీ టోర్నీ టికెట్ల అమ్మకాలపై ఐసీసీ అప్‌డేట్ ఇచ్చింది. మంగళవారం నుంచి టికెట్ల అమ్మకాలు చేపట్టనున్నట్టు వెల్లడించింది. అయితే, ప్రస్తుతం పాక్‌లో జరిగే మ్యాచ్ టికెట్లే సేల్ చేయనున్నట్టు పేర్కొంది.
భారత్ మ్యాచ్‌లు దుబాయ్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే. భారత్ మ్యాచ్‌ల టికెట్లకు సంబంధించి త్వరలోనే అప్‌డేట్ ఇస్తామని చెప్పింది. అలాగే, మార్చి 4న జరిగే ఫైనల్ మ్యాచ్ టికెట్లను తొలి సెమీస్ మ్యాచ్ తర్వాత అందుబాటులోకి వస్తాయని తెలిపింది. టోర్నమెంట్ డైరెక్టర్ సుమైర్ అహ్మద్ టికెట్ రేట్లను రివీల్ చేశాడు. జనరల్ కేటగిరీ టికెట్ 1000 పాకిస్తాన్ రూపాయలు(భారత కరెన్సీ ప్రకారం రూ. 310) నుంచి, ఫస్ట్‌క్లాస్ కేటగిరీ టికెట్ 1,500 పాకిస్తాన్ రూపాయలు(భారత కరెన్సీలో రూ.465) నుంచి ప్రారంభంకానున్నాయి. అలాగే, ప్రీమియమ్, వీఐపీ, వీవీఐపీ, గ్యాలరీ కేటగిరీల్లో టికెట్లు ఉన్నాయి.
నేటి నుంచి భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటల నుంచి టికెట్ల అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఫిబ్రవరి 3 నుంచి ఫిజికల్ టికెట్లు ఇవ్వనున్నారు. చాంపియన్స్ ట్రోఫీ వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.






