- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, స్పోర్ట్స్ : మరో 60 రోజుల్లో ఇంగ్లాండ్ వేదికగా మహిళల టీ20 వరల్డ్ కప్ ప్రారంభంకానుంది. ఈ పొట్టి ప్రపంచకప్‌కు సంబంధించిన ప్రైజ్‌మనీని సోమవారం ఐసీసీ రికార్డు స్థాయిలో ప్రకటించింది. ప్రైజ్ పూల్ మొత్తం దాదాపు రూ.82 కోట్లుగా నిర్ణయించింది. గత ఎడిషన్ 2024లో ఈ మొత్తం రూ.70 కోట్లకుపైగా ఉంది. ఈ సారి మొత్తాన్ని ఐసీసీ 10 శాతం పెంచింది. విజేతగా నిలిచిన జట్టుకు రూ.21.8 కోట్లు దక్కనుండగా.. రన్నరప్ టీమ్‌కు రూ.10 కోట్లు అందనున్నాయి. సెమీస్‌లో ఓడిన రెండు జట్లకు రూ.6.3 కోట్లు పొందుతాయి. ఇక గ్రూపు దశలో గెలిచిన ప్రతి జట్టుకు రూ.29 లక్షలు ఇవ్వనుంది. టోర్నీలో పాల్గొనే ప్రతి జట్టు కనీసం రూ.2.3 కోట్లతోనే ఇంటికి వెళ్తుందని ఐసీసీ తెలిపింది. గత ఎడిషన్‌లో 10 జట్లు పాల్గొనగా.. టోర్నీ చరిత్రలో తొలిసారిగా ఈ ఎడిషన్‌లో 12 జట్లు పోటీలో ఉన్నాయి. జూన్ 12 నుంచి వరల్డ్ కప్ ప్రారంభంకానుంది. సోమవారం నుంచి ఐసీసీ ట్రోఫీ టూర్ ప్రారంభమైనట్టు ఐసీసీ తెలిపింది. లండన్‌లో మొదలై యూరోప్ అంతటా ట్రోఫీ పర్యటన ఉంటుందని పేర్కొంది.






