- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
WTC : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ప్రైజ్‌మనీ ప్రకటించిన ఐసీసీ
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ జట్లకు ప్రైజ్ మనీ (WTC Prize Money) ప్రకటించింది.

దిశ, వెబ్‌డెస్క్: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ జట్లకు ప్రైజ్ మనీ (WTC Prize Money) ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా ప్రైజ్ మనీ ప్రకటించడం విశేషం. గత టోర్నీల కంటే 2023-25 డబ్ల్యూటీసీ ఫైనల్ (2023-25 WTC Final)కు రెండింతలు పెంచారు. ఈసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (World Test Championship) విజేతకు 36 లక్షల డాలర్లు ఇవ్వనున్నట్లు ఐసీసీ వెల్లడించింది. విజేతతో సహా మొత్తం 8 జట్లకు కలిపి ప్రైజ్ మనీ రూ.49.27 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. విజేతగా నిలిచిన జట్టుకు రూ.30.78 కోట్లు, రన్నరప్ గా నిలిచే జట్టుకు రూ.18.46 కోట్ల నజరానా అందించనున్నట్లు స్పష్టం చేసింది. టెస్ట్ క్రికెట్ కు ఉన్న ప్రాముఖ్యతను పెంచేందుకే ప్రైజ్ మనీ పెంచినట్లు ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా.. 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో ఇండియాపై ఫైనల్ మ్యాచ్ లో గెలిచిన ఆస్ట్రేలియాకు 1.6 మిలియన్ల డాలర్ల ప్రైజ్ మనీ దక్కగా.. రన్నరప్ గా నిలిచిన జట్టుకు 8 లక్షల డాలర్ల ప్రైజ్ మనీ ఇచ్చింది.
ఇక 2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లార్డ్స్ మైదానంలో (Lord's Ground) జరగనుంది. డబ్ల్యూటీసీ టేబుల్‌లో ఈసారి సౌతాఫ్రికా ఫస్ట్‌ప్లేస్‌లో నిలిచింది. శ్రీలంక, పాకిస్తాన్‌లతో జరిగిన హోం సిరీస్‌లో గెలిచిన సౌతాఫ్రికా 69.44 శాతం పాయింట్లతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా 67.54 పాయింట్లతో సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. 50.00 పాయింట్లతో ఇండియా థర్డ్ ప్లేస్‌లో నిలిచింది.






