అప్పటి వరకు గిల్‌ను రక్షిస్తూనే ఉంటా : గౌతమ్ గంభీర్

by Harish |

టీమ్ ఇండియా కెప్టెన్ గిల్‌పై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రశంసలు కురిపించాడు.

అప్పటి వరకు గిల్‌ను రక్షిస్తూనే ఉంటా : గౌతమ్ గంభీర్
X

దిశ, స్పోర్ట్స్ : భారత జట్టును సరైన మార్గంలో నడిపిస్తున్నంత కాలం టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు తన మద్దతు ఉంటుందని, అతన్ని రక్షిస్తూనే ఉంటానని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించాడు. వెస్టిండీస్‌తో రెండు టెస్టు సందర్భంగా మాజీ క్రికెటర్‌తో కలిసి గంభీర్ మాట్లాడాడు. గిల్ గురించి మాట్లాడుతూ.. టెస్టు కెప్టెన్‌గా చేసినప్పుడు అతనికి ఒక్కటే చెప్పానని, ‘మేం నిన్ను లోతైన సముద్రంలో పడేసాం. మునిగిపోవడమో? లేదా గొప్ప స్విమ్మర్ కావడమో?. ఈ రెండే నీ ముందున్న మార్గాలు’అని చెప్పానని తెలిపాడు.

ఈ సందర్భంగా గిల్‌‌పై ప్రశంసలు కురిపించాడు. ఇంగ్లాండ్ టూరులో జట్టును అద్భుతంగా నడిపించాడన్నాడు. అతని కెప్టెన్సీకి ఇంప్రెస్ అయ్యానని ప్రశంసించాడు. కెప్టెన్‌గా తొలి టెస్టు సిరీస్‌లో 750 రన్స్ చేయడం, ఒత్తిడిని తట్టుకోవడం చిన్న విషయం కాదన్నాడు. ‘గిల్ తన కెరీర్‌లో అంతకంటే కఠినమైన సిరీస్ ఎదుర్కొని ఉండకపోవచ్చు. కెప్టెన్‌గా 10 ఏళ్లు ఉంటామా.. రెండేళ్లు ఉంటామా అనేది పక్కన పెడితే గిల్ ఇంగ్లాండ్‌లో ఒత్తిడిని బాగా హ్యాండిల్ చేశాడు. ఓవల్ టెస్టు తర్వాత గిల్‌తో చెప్పాను. నువ్వు కఠినమైన టెస్టులో పాసయ్యావని,ఇక నుంచి అంత సులువుగానే మారిపోతుందని చెప్పా.’అని గంభీర్ తెలిపాడు.


Next Story