ఉప్పల్ స్టేడియంలో స్టాండ్‌కు పేరు తొలగించడంపై అజారుద్దీన్ ఫైర్.. హైకోర్టుకు వెళ్తానంటూ కామెంట్స్

by Harish |   (  Updated:2025-04-20 12:39:53  IST  )

ఉప్పల్ స్టేడియంలోని నార్త్ స్టాండ్‌కు ఉన్న భారత మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ పేరును తొలగించాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అంబుడ్స్‌మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఆదేశించిన విషయం తెలిసిందే.

ఉప్పల్ స్టేడియంలో స్టాండ్‌కు పేరు తొలగించడంపై అజారుద్దీన్ ఫైర్.. హైకోర్టుకు వెళ్తానంటూ కామెంట్స్
X

దిశ, స్పోర్ట్స్ : ఉప్పల్ స్టేడియంలోని నార్త్ స్టాండ్‌కు ఉన్న భారత మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ పేరును తొలగించాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అంబుడ్స్‌మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై అజారుద్దీన్ స్పందించాడు. పీటీఐతో మాట్లాడుతూ.. ‘లీగల్‌గా వెళ్తాను., అంబుడ్స్‌మన్ ఆదేశాలపై స్టే కోసం హైకోర్టును ఆశ్రయిస్తా.’ అని తెలిపాడు. భారత కెప్టెన్ పేరు తొలగించాలని కోరడం సిగ్గుచేటు అంటూ తీవ్రంగా స్పందించాడు. అలాగే, అంబుడ్స్‌మన్ పదవీకాలం ఫిబ్రవరితోనే ముగిసిందని, ఆ తర్వాత ఇచ్చిన ఆదేశాలు చెల్లవని చెప్పాడు. వార్షిక సాధారణ సమావేశంలోనే పదవీకాలం పొడిగింపు జరుగుతుందని, కానీ, అది జరగలేదన్నాడు. అలాంటప్పుడు ఆదేశాలు ఎలా జారీ చేశారని ప్రశ్నించాడు. స్టాండ్‌కు మరో భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ పేరు‌ను తాను తొలగించానన్న ఆరోపణలను అజారుద్దీన్ కొట్టిపారేశాడు. పెవిలియన్‌కు ఇప్పటికీ లక్ష్మణ్ పేరు ఉందని, వెళ్లి చూసుకోవాలన్నాడు. హెచ్‌సీఏకు క్రికెటర్లకు గౌరవం ఇవ్వడం తెలియదని మండిపడ్డాడు. 2019 నుంచి 2023 వరకు అజారుద్దీన్ హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌గా ఉన్నాడు.

Next Story