ఫిట్‌నెస్, నైపుణ్యాలపై ఫోకస్ : శిఖర్ ధావన్

by Dishanational3 |
ఫిట్‌నెస్, నైపుణ్యాలపై ఫోకస్ : శిఖర్ ధావన్
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2024లో పంజాబ్ కింగ్స్‌కు టైటిల్ అందించడంపై ఫోకస్ పెట్టామని ఆ జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్ తెలిపాడు. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధావన్ తన ఐపీఎల్ సన్నద్ధత గురించి మాట్లాడాడు. ‘ఐపీఎల్ ప్రిపరేషన్స్ బాగా జరుగుతున్నాయి. ఫిట్‌నెస్, నైపుణ్యాలపై దృష్టి పెట్టాను. ఈ సీజన్‌లో నేను సత్తాచాటుతాననుకుంటున్నా. పంజాబ్ కింగ్స్‌ టైటిల్ అందించడంపైనే ఫోకస్ పెట్టాం. అలాగే, జట్టులో మంచి వాతావరణం సృష్టించడంపై దృష్టి పెట్టాం. కుర్రాళ్లు అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేలా జట్టులో వాతావరణం ఉండేలా చూస్తాం. కెప్టెన్‌గా అది నా బాధ్యత.’ అని ధావన్ చెప్పుకొచ్చాడు. కాగా, గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ పేలవ ప్రదర్శన చేసింది. 14 మ్యాచ్‌ల్లో ఆరు మాత్రమే గెలిచి.. 8 మ్యాచ్‌ల్లో ఓడింది. పాయింట్స్ టేబుల్‌లో 8వ స్థానంలో నిలిచింది.



Next Story

Most Viewed