నేను అధికారికంగా రిటైర్ అవ్వలేదు.. క్రికెటర్ షకీబ్ సంచలన ప్రకటన

by Malleboina Mahesh |

బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, ఎన్నో సంవత్సరాలు బెస్ట్ ఆల్ రౌండర్ గా పేరుగాంచిన షకీబ్ అల్ హసన్ గతేడాది టెస్టులు, టీ20లకు రిటైర్‌మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

నేను అధికారికంగా రిటైర్ అవ్వలేదు.. క్రికెటర్ షకీబ్ సంచలన ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, ఎన్నో సంవత్సరాలు బెస్ట్ ఆల్ రౌండర్ గా పేరుగాంచిన షకీబ్ అల్ హసన్ (Shakib Al Hasan) గతేడాది టెస్టులు, టీ20లకు రిటైర్‌మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రిటైర్మెంట్ (Retirement) ప్రకటన తర్వాత షకీబ్ ఎటువంటి మ్యాచులో ఆడలేదు. అయితే అతను గతంలో రాజకీయంలోకి వెళ్లడంతో ఇకపై మ్యాచులు ఆడటం కష్టమే అని భావించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా షకీబ్.. తాను అన్ని ఫార్మాట్ల నుంచి అధికారికంగా రిటైర్ అవ్వలేదని తాజాగా 'కాలెడన్ & పాడ్ కాస్ట్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. బంగ్లాదేశ్ తరపున టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లలో ఆడిన తర్వాతే రిటైరవ్వాలని తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అయితే, గతేడాది తాను ఒక లీగ్ అధికారి కారణంగా తన స్థానాన్ని కోల్పోయానని షకీబ్ ఆరోపించారు. దీనితో పాటు, షకీబ్ ఓ 'అనధికారిక' ఖాతా వ్యవహారంలో అవినీతి కేసును కూడా ఎదుర్కొంటున్నట్లు సమాచారం అందుతుంది. దీంతో అతని వ్యాఖ్యలు త్వరలోనే షకీబ్ బంగ్లాదేశ్ జట్టు తరఫున మరోసారి మైదానంలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

Next Story