సీఎం తెలియదు.. కానీ హీరో విజయ్ నా డార్లింగ్! మను భాకర్

by Geesa Chandu |

పారిస్ ఒలింపిక్ పతక విజేత మను భాకర్.. దేశవ్యాప్త పర్యటనలో భాగంగా చెన్నైకి చేరుకున్నారు.

సీఎం తెలియదు.. కానీ హీరో విజయ్ నా డార్లింగ్! మను భాకర్
X

దిశ, వెబ్ డెస్క్: పారిస్ ఒలింపిక్ పతక విజేత మను భాకర్.. దేశవ్యాప్త పర్యటనలో భాగంగా చెన్నైకి చేరుకున్నారు. అక్కడ జరిగిన ఒక సన్మాన కార్యక్రమంలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు సినీ అగ్ర హీరోల్లో ఒకరైన తలపతి విజయ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో మొదటగా ఆమెను చెన్నైలోని ప్రఖ్యాత దేవాలయాలు అయిన కామాక్షి టెంపుల్, మహా బలేశ్వరం గురించి అడిగితే.. తనకు ఆ టెంపుల్స్ గురించి తెలియదని సమాధానం చెప్పింది. తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఎవరో మీకు తెలుసా? అని అడిగిన ప్రశ్నకు కూడా ఆమె తెలియదని సమాధానం చెప్పింది. తదుపరి ప్రశ్నగా.. తలపతి విజయ్ గురించి మీకు ఏమైనా తెలుసా? అని ఆమెను అడగ్గానే.. అవును హీరో విజయ్ నాకు తెలుసు, విజయ్ నా డార్లింగ్ అని సమాధానమిచ్చింది. దీంతో ఆ కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకులు ఈలలు కేకలతో గట్టిగా చప్పట్లు కొట్టారు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Next Story