- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
నాకు ఎక్కువగా సమయం లేదన్న రొనాల్డో.. ఆందోళనలో అభిమానులు!
దిశ, స్పోర్ట్స్ : ప్రపంచ దిగ్గజ ఫుట్‌బాల్ ప్లేయర్లలో ఒకరైన పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తన రిటైర్మెంట్‌పై హింట్ ఇచ్చారు. ప్రపంచంలోని ఆల్‌టైమ్ గొప్ప ఫుట్‌బాల్ ఆటగాళ్ళలో రొనాల్డో ఒకరిగా పేరొందాడు. తాజాగా అల్‌నాస్ర్ కోసం AFC ఛాంపియన్స్ లీగ్ ఆడిన తర్వాత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఫుట్‌బాల్ ఆట నుంచి వైదొలగడానికి ‘నాకు ఎక్కువ సమయం మిగిలి’ లేదని పేర్కొన్నాడు. ఈ దశలో తనకు వ్యక్తిగత అవార్డులు, గౌరవాలు ‘ముఖ్యమైనవి కావు’ అని స్పష్టంచేశాడు.
AFC ఛాంపియన్స్ లీగ్‌లో అల్ రయాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అల్-నాస్ర్ కోసం రొనాల్డో మ్యాచ్-విన్నింగ్ గోల్ చేశాడు. 2-1తో గోల్స్ తేడాతో జట్టుకు విజయాన్ని అందించాడు. 39 ఏళ్ల రొనాల్డో గత సీజన్‌లో తన జట్టు కోసం 50 గోల్స్ సాధించాడు. పోర్చుగల్ జాతీయ జట్టుకు 2003 నుంచి కెప్టెన్‌గా కొనసాగుతున్న రొనాల్డో.. 5 బ్యాలన్ డి ఓర్ అవార్డులు, 4 యూరోపియన్ గోల్డెన్ షూస్‌ను గెలుచుకున్న ఏకైక యూరప్ ఆటగాడిగా రొనాల్డో రికార్డు సృష్టించాడు.