- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sania Mirza : కొడుక్కి పాలు కూడా ఇవ్వలేక పోయా : టెన్నిస్ మాజీ స్టార్
తన కొడుక్కి పాలు కూడా సరిగ్గా ఇవ్వలేక పోయానని టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా(Sania Mirza) ఆవేదన వ్యక్తం చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : తన కొడుక్కి పాలు కూడా సరిగ్గా ఇవ్వలేక పోయానని టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా(Sania Mirza) ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఓ పాడ్ కాస్ట్ లో తన మదర్ హుడ్(Mother Hood) విశేషాలను పంచుకున్న సానియా.. ఆ రోజులను తలచుకుని భావోద్వేగానికి గురయ్యారు. తన కుమారుడు ఇజాన్(Izan) పుట్టిన 3 నెలల వరకు మాత్రమే పాలు ఇవ్వడానికి కుదిరిందని.. తర్వాత ఆటపై ఫోకస్ పెట్టాల్సి రావడంతో తాను కొడుక్కు మాతృప్రేమను పంచలేక పోయానని కన్నీటి పర్యంతం అయింది. దీంతో మానసికంగా, శారీరకంగా బాగా అలసిపోయానని చెప్పుకొచ్చింది ఈ హైదరాబాద్ ప్లేయర్.
ఆ సమయంలో ఆటపరంగా, ఇతర పనుల పరంగా, నిద్ర ఉండేది కాదని, శరీరం ఆటకు సహకరించకపోయేదని పేర్కొంది. అప్పుడున్న పరిస్థితుల్లో తనకు మానసిక తోడ్పాటు కూడా సరిగా లేదని.. వీటన్నిటి దృష్ట్యా తాను ఆటకు రిటైర్మెంట్(Retiarment) ప్రకటించానని బాధ పడింది. ఒక మాతృమూర్తి ఇటు తన సంతానాన్ని, అటు కెరియర్ ను బ్యాలన్స్ చేయడం అంత సులువు కాదని వెల్లడించిన సానియా.. కుటుంబ సభ్యుల సహకారం, అండ లేకుంటే పరిస్థితి మరింత దిగజారుతుందని తెలియజేసింది.






