డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడేందుకు నేను అర్హుడిని కాను..! హార్ధిక్ పాండ్య

by Kema Shiva Kumar |

బోర్డర్ - గవాస్కర్ ట్రోపీలో ఆస్ట్రేలియాను 2-1 తేడాతో ఓడించిన అనంతరం భారత జట్టు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.

డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడేందుకు నేను అర్హుడిని కాను..! హార్ధిక్ పాండ్య
X

దిశ, వెబ్ డెస్క్: బోర్డర్ - గవాస్కర్ ట్రోపీలో ఆస్ట్రేలియాను 2-1 తేడాతో ఓడించిన అనంతరం భారత జట్టు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. జూన్ 7 నుంచి 11 వరకు ఇంగ్లాండ్ లోని ‘ది ఓవల్’ వేదికగా భారత్ - ఆస్ట్రేలియాలు టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ లో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ కోసం వెతుకుతున్న టీమిండియాకు హార్ధిక్ పాండ్యా షాకిచ్చాడు.

తాను డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడబోనని స్పష్టం చేశాడు. అందుకు తాను అర్హుడు కాదని తేల్చి చెప్పాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు గురువారం విలేకరుల సమావేశంలో పాల్గొన్న పాండ్యాకు ఇదే ప్రశ్న ఎదురైంది. అక్కడికి వచ్చిన పాత్రికేయులు ‘మీరు డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడతారా..?’అని అడగ్గా దానికి పాండ్యా స్పందిస్తూ.. లేదని ముక్కుసూటిగా చెప్పేశాడు.

విలువలకు కట్టుబడే మనిషిని.. అది కరెక్ట్ కాదు.. : పాండ్యా

తాను డబ్ల్యూటీసీ ఫైనల్ ఎందుకు ఆడడటనే దానికి గల కారణాలను వివరిస్తూ పాండ్యా ‘నేను నైతికంగా చాలా బలమైన వ్యక్తిని. విలువలకు కట్టుబడి ఉంటా. వాస్తవంగా చెప్పాలంటే డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడేందుకు గాను మిగతా ఆటగాళ్లు చేసినదాంట్లో నేను 10 శాతం కూడా చేయలేదు. అసలు ఒక్క శాతం కూడా కృషి చేయలేదు. ఇప్పటికిప్పుడు నేను వచ్చి మరొకరి స్థానాన్ని తీసుకోవడం కరెక్ట్ కాదు.

అది సమంజసం కాదు కూడా.. టెస్టు క్రికెట్ ఆడాలనుకుంటే అందుకు నన్ను నేను నిరూపించుకోవాలి. మానసికంగా నన్ను నేను సిద్ధం చేసుకున్నాకే ఆడతా. అప్పటిదాకా టెస్టులు కూడా ఆడను..’అని చెప్పుకొచ్చాడు. ఇప్పట్లో టెస్టులకు వచ్చే ఉద్దేశం తనకు లేదని హార్ధిక్ చెప్పకనే చెప్పాడు.

Next Story