Vinod Kambli : నేను బతికే ఉన్నాను...వినోద్ కాంబ్లీ

by Y. Venkata Narasimha Reddy |

నేను బతికే ఉన్నానని(I am alive), వైద్యుల కృషి వల్ల నా ఆరోగ్యం బాగానే ఉందని(My health is Good) భారత మాజీ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లి (Vinod Kambli) స్పష్టం చేశారు.

Vinod Kambli : నేను బతికే ఉన్నాను...వినోద్ కాంబ్లీ
X

దిశ, వెబ్ డెస్క్ : నేను బతికే ఉన్నానని(I am alive), వైద్యుల కృషి వల్ల నా ఆరోగ్యం బాగానే ఉందని(My health is Good) భారత మాజీ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లి (Vinod Kambli) స్పష్టం చేశారు. గతకొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కాంబ్లీ తన ఆరోగ్యం క్షీణించడంతో శనివారం థానే జిల్లాలోని కల్హర్‌లో ఉన్న ఓ ఆసుపత్రిలో చేరారు. మూత్రనాళాల ఇన్‌ఫెక్షన్‌తో అతడు ఆసుపత్రిలో చేరగా వైద్య పరీక్షల్లో అతడి మెదడులో రక్తం గడ్డకట్టినట్టు తేలింది. ప్రస్తుతం ఐసీయూలో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇంతలోనే కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి విషమించిందంటూ ప్రచారం చోటుచేసుకుంది.

ఈ క్రమంలో తన ఆరోగ్య పరిస్థితిపై కాంబ్లీ తాజాగా స్పందించారు. వైద్యుల వల్ల తాను బతికే ఉన్నానని తెలిపారు. ‘ఇక్కడి డాక్టర్ల వల్ల నేను బతికి ఉన్నాను’ అంటూ హాస్పిటల్‌ బెడ్‌పై తన వైద్య బృందంతో కలిసి కాంబ్లీ వీడియో ప్రకటన విడుదల చేశారు. తన ఆరోగ్యంపై జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇస్తూ కాంబ్లి విడుదల చేసిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Next Story