- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL 2025 : చిత్తుగా ఓడిన హైదరాబాద్.. వరుసగా నాలుగో ఓటమి
ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో భాగంగా నేడు హైదరాబాద్ సన్ రైజర్స్, గుజరాత్ టైటాన్స్(SRH vs GT) మధ్య జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ చిత్తుగా ఓడిపోయింది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో భాగంగా నేడు హైదరాబాద్ సన్ రైజర్స్, గుజరాత్ టైటాన్స్(SRH vs GT) మధ్య జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ చిత్తుగా ఓడిపోయింది. మరోసారి బ్యాటర్స్ పూర్తిగా విఫలం అయ్యారు. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం(Uppal Stadium) వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత హైదరాబాద్ బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. నితీశ్ కుమార్ 31, క్లాసెన్ 27, కమిన్స్ 22 తప్ప ఎవ్వరి స్కోర్ 20 దాటలేదు. గుజరాత్ జట్టులో సిరాజ్ ఒక్కడే 4 వికెట్లు తీసి హైదరాబాద్ జట్టును భారీ దెబ్బ కొట్టాడు. 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 3 వికెట్ల నష్టానికి 16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. గిల్ 61 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. సుందర్ 49 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చారు.
Next Story






