గెలిచిన సౌతాఫ్రికాకు రూ.31 కోట్లు.. మరి ఆసీస్‌కు ఎంత?

by Phanindra |

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాను సౌతాఫ్రికా గెలిచింది. సౌతాఫ్రికాకు రూ.31 కోట్లు ప్రైజ్‌మనీ అందింది. మరి ఆసీస్‌కు ఎంత దక్కిందంటే?

గెలిచిన సౌతాఫ్రికాకు రూ.31 కోట్లు.. మరి ఆసీస్‌కు ఎంత?
X

దిశ, స్పోర్ట్స్: లార్డ్స్ వేదికగా జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో సఫారీలు చెలరేగారు. అద్భుతమైన ఆటతో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను చిత్తుచేసి టైటిల్ గెలిచారు. తొలి ఇన్నింగ్సులో 138 పరుగులకే ఆలౌట్ అయిన సౌతాఫ్రికా టీం.. రెండో ఇన్నింగ్సులో 282 పరుగుల టార్గెట్‌ను ఛేజ్ చేసి సంచలనం సృష్టించింది. మరో ఐదు వికెట్లు మిగిలుండగానే నాలుగో రోజు తొలి సెషన్‌లోనే మ్యాచ్ నెగ్గింది. ఎయిడెన్ మార్క్రమ్ (136) అద్భుతమైన ఆటతీరుతో సౌతాఫ్రికాను విజయం వైపు నడిపించాడు. కెప్టెన్ టెంబా బవుమా (66) నాలుగో రోజు ఆట ఆరంభంలోనే వెనుతిరిగినా.. కీలక ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. 83.4 ఓవర్లలో 282/5 పరుగులు చేసిన సౌతాఫ్రికా సుమారు 27 ఏళ్ల తర్వాత ఐసీసీ టైటిల్ నెగ్గడం గమనార్హం.

ప్రైజ్‌మనీ ఎంతంటే..?

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో అద్భుత విజయం సాధించిన సౌతాఫ్రికాకు 3.6 మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ దక్కుతుంది. ఇది మన లెక్కల్లో సుమారు రూ.31.05 కోట్లు. ఫైనల్లో ఓడిన ఆస్ట్రేలియాకు 2.16 మిలియన్ డాలర్లు (సుమారు రూ.18.63 కోట్లు) అందుతాయి. ఇక డబ్ల్యూటీసీ సైకిల్‌ను మూడో స్థానంలో ముగించిన భారత్‌కు కూడా రూ.12.42 కోట్ల ప్రైజ్‌మనీ ఇస్తారు.

Next Story