- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎంత మంది దేశవాళీ ఆడుతున్నారో చెప్పాలి?.. సౌతాఫ్రికా చేతిలో ఓటమిపై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు
సౌతాఫ్రికాతో చేతిలో భారత జట్టు టెస్టు సిరీస్ క్లీన్‌స్వీప్ అవడంపై భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

దిశ, స్పోర్ట్స్ : సౌతాఫ్రికాతో చేతిలో భారత జట్టు టెస్టు సిరీస్ క్లీన్‌స్వీప్ అవడంపై భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టెస్టు క్రికెట్ అంటేనే క్రీజులో పాతుకపోవడమని, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ వంటి ప్లేయర్లు ప్రస్తుత జట్టులో లేరని వ్యాఖ్యానించాడు. అలాగే, ఇప్పుడు స్టార్ క్రికెటర్లు ఎంత మంది దేశవాళీ క్రికెట్ ఆడుతున్నారని ప్రశ్నించాడు. దేశవాళీలో ఆడటం చాలా ముఖ్యమన్నాడు. దేశవాళీ క్రికెట్ ఆడకుండా, నాణ్యమైన బౌలర్లను ఎదుర్కోకపోతే ఇబ్బందులు తప్పవన్నాడు.
అలాగే, పిచ్‌లపై కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘టాస్ ఓడిపోతే మ్యాచ్ కూడా పోతుంది. ఏ జట్టు కూడా 200 దాటని పిచ్‌లతో ఉపయోగం ఏంటి?. అది టెస్టు క్రికెట్‌కు మంచిది కాదు.’అని తెలిపాడు. అలాగే, వన్డేలు, టీ20లు ఎక్కువగా ఆడటం వల్ల బ్యాటర్లు రెడ్ బాల్ క్రికెట్ ఆడటానికి కావాల్సిన ఓపికను కోల్పోతున్నారని చెప్పాడు. ‘స్పిన్, పేస్‌కు అనుకూలించే పిచ్‌లపై ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉండాలి. ప్రస్తుతం క్రీజులో పాతుకపోయే రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్‌లాంటి బ్యాటర్లు లేరు. టెస్టుల్లో బ్యాటింగ్ అంటేనే క్రీజులో పాతుకపోవడం’అని కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు.






