ఇవాళ పాకిస్థాన్ మ్యాచ్.. టీమిండియా సెమీ ఫైన‌ల్స్ చేరాలంటే ఎలా?

by velandi.Saikiran |   (  Updated:2025-10-21 08:59:46  IST  )

పాకిస్తాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. కొలంబో లోని ప్రేమ దాస స్టేడియం వేదికగా ఈ రెండు జట్లు

ఇవాళ పాకిస్థాన్ మ్యాచ్.. టీమిండియా సెమీ ఫైన‌ల్స్ చేరాలంటే ఎలా?
X

దిశ‌, వెబ్ డెస్క్ : మహిళల వ‌న్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ పాకిస్తాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. కొలంబో లోని ప్రేమ దాస స్టేడియం వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే సౌత్ ఆఫ్రికా సెమీ ఫైనల్ కు క్వాలిఫై అయింది. ఇక ఈ మ్యాచ్ లో కూడా పాకిస్తాన్ ఓడిపోతే అధికారికంగా ఎలిమినేట్ కానుంది. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్ లు ఆడిన పాకిస్తాన్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. రెండు వర్షం కారణంగా రద్దయ్యాయి. ఇక ఈ టోర్నమెంటులో టీమిండియా పరిస్థితి చాలా డిఫరెంట్ గా ఉంది. ఆడిన ఐదు మ్యాచ్ లలో రెండింటిలో విజయం సాధించింది టీమిండియా.

ఈ తరుణంలోని నాలుగు పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. అయితే టీమిండియా మరో రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఇందులో న్యూజిలాండ్ తో పాటు బంగ్లాదేశ్ తో తలపడాలి. ఈ రెండు మ్యాచ్ ల‌లో కూడా టీమిండియా గెలిస్తే, ఎలాంటి డౌట్ లేకుండా నేరుగా సెమీ ఫైనల్ కు చేరుతుంది. అలా కాదని న్యూజిలాండ్ చేతిలో ఓడిపోతే, తర్వాత బంగ్లాదేశ్ పైన కచ్చితంగా గెలవాలి. దాంతో పాటు ఇంగ్లాండ్ చేతిలో న్యూజిలాండ్ ఓడిపోవాల్సిందే. అప్పుడు టీం ఇండియా సెమీ ఫైనల్ కు చేరుతుంది. లేదంటే టీమ్ ఇండియా ఇంటికి, న్యూజిలాండ్ సెమీ ఫైనల్ కు చేరుతుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఇండియా , న్యూజిలాండ్ రెండు జట్లు నాలుగు పాయింట్ల‌తో సెమీస్ కోసం పోరాడుతున్నాయి. మరి ఇందులో ఎవరికి ఆ అదృష్టం వరిస్తుందో చూడాలి.

Next Story