వన్డేల్లో సిరాజ్ సడెన్‌గా ఎందుకు కనిపించడం లేదు.. మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు

by Harish |

హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను కేవలం ఒక్క టెస్టులకే పరిమితం చేయడంపై భారత మాజీ క్రికెట్ ఆకాశ్ చోప్రా అసంతృప్తి వ్యక్తం చేశాడు.

వన్డేల్లో సిరాజ్ సడెన్‌గా ఎందుకు కనిపించడం లేదు.. మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, స్పోర్ట్స్ : హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను కేవలం ఒక్క టెస్టులకే పరిమితం చేయడంపై భారత మాజీ క్రికెట్ ఆకాశ్ చోప్రా అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాజాగా తన యూట్యూబ్ చానెల్‌లో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో పేలవ బౌలింగ్‌‌ ప్రదర్శన నేపథ్యంలో సిరాజ్ అవసరాన్ని నొక్కి చెప్పాడు. ఒకప్పుడు టెస్టులు, వన్డేలు, టీ20లు మూడు ఫార్మాట్లలో భాగమైన సిరాజ్ ఇప్పుడు ఒక్క ఫార్మాట్‌కే పరిమితమవడాన్ని ప్రశ్నించాడు. ‘వన్డే క్రికెట్‌లో సిరాజ్ ఎందుకు అదృశ్యమయ్యాడు?. ప్రస్తుతం అతను దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. చాంపియన్స్ ట్రోఫీకి అతన్ని ఎంపిక చేయనప్పుడు చాలా నిరాశ చెందాం. ఎందుకంటే దానికి ముందు రెండేళ్ల క్రితం అతను వన్డే ఫార్మాట్‌లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసింది అతనే. సడెన్‌గా అతని పేరు మిస్ అయ్యింది. ఇప్పటికీ అతను వన్డే జట్టులో లేడు. హర్షిత్ రాణా, ప్రసిద్ధ కృష్ణ ఆడుతున్నారు. కానీ, సిరాజ్ మాత్రం కనిపించడం లేదు. వన్డేల్లో ఆడటం లేదు. టీ20లకు దూరమయ్యాడు. అతన్ని ఎందుకు పక్కనపెడుతున్నారో? నాకు తెలియదు. అతనెప్పుడు సింగిల్ ఫార్మాట్ ప్లేయర్ అయ్యాడో నాకు అర్థం కావడం లేదు.’అంటూ చోప్రా ప్రశ్నలు సంధించాడు. 2023 వరకు సిరాజ్ రెగ్యులర్‌గా వన్డేలు ఆడాడు. ఆ తర్వాత అతన్ని పక్కనపెడుతూ వచ్చారు. గతేడాది కేవలం 3 వన్డేలే ఆడాడు. ఈ ఏడాది కూడా అన్నే ఆడాడు. 47 వన్డేలు ఆడిన సిరాజ్ 73 వికెట్లు తీశాడు.


Next Story