ఆశలు ఇంకా సజీవమే.. ప్లేఆఫ్స్‌కు చేరాలంటే CSK లెక్కలు ఇవే..!

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-03 06:19:34  IST  )

ఐపీఎల్-2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ప్లేఆఫ్స్ ఆశలపై ఫ్యాన్స్‌లో టెన్షన్ నెలకొంది.

ఆశలు ఇంకా సజీవమే.. ప్లేఆఫ్స్‌కు చేరాలంటే CSK లెక్కలు ఇవే..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఐదు సార్లు ఛాంపియన్స్, ప్రత్యర్థి జట్ల నుంచి గెలుపును తమ ఆటతీరుతో అలవోకగా లాక్కునే ప్లేయర్లు అయినా ఆ జట్టుకు ఈసారి కలిసి రావడం లేదు. ఆడిన 9 మ్యాచ్‌లలో గెలించింది నాలుగు మాత్రమే. ఐపీఎల్-2026 సీజన్ క్లైమాక్స్‌కు చేరుకుంటున్న తరుణంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పరిస్థితి ఉత్కంఠభరితంగా మారింది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఇకపై జరిగే ప్రతి మ్యాచ్ ఆ జట్టుకు ‘డూ ఆర్ డై’గా మారింది. పాయింట్ల పట్టికలో మిగిలిన జట్ల సమీకరణాలు కూడా ఇప్పుడు సీఎస్‌కే భవితవ్యాన్ని శాసిస్తున్నాయి.

ప్లేఆఫ్స్ చేరాలంటే ఏం జరగాలి..

చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్‌ (Playoff's)కు చేరుకోవడానికి లీగ్ స్టేజ్‌లో మిగిలిన అన్ని మ్యాచ్‌లలో తప్పనిసరిగా విజయం సాధించాలి. ముఖ్యంగా భారీ రన్ రేట్‌తో గెలిస్తే అది పాయింట్ల పట్టికలో ఇతర జట్లతో సమానమైన పాయింట్లు వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఉన్న సమీకరణాల ప్రకారం, కేవలం పాయింట్లు మాత్రమే సరిపోవు. ఇతర జట్ల నెట్ రన్‌రేట్ కంటే సీఎస్‌కే మెరుగ్గా ఉండాలి. అందుకే ప్రతి విజయం భారీ తేడాతో ఉండటం ముఖ్యం. కేవలం తమ గెలుపు మాత్రమే కాదు.. ప్లేఆఫ్స్ రేసులో ఉన్న ఇతర జట్లు తమ తదుపరి మ్యాచ్‌లలో ఓడిపోవాలి. అప్పుడే సీఎస్‌కే‌కు లైన్ క్లియర్ అవుతుంది.

గెలవాల్సిన మ్యాచ్‌లలో..

ప్రస్తుతం సీఎస్‌కే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అంతగా రాణించకపోవడం ప్రధాన సమస్యగా మారింది. మిడిల్ ఓవర్లలో వికెట్లు కోల్పోవడం, డెత్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకోవడంతో గెలివాల్సిన మ్యాచ్‌లలో చేతులెత్తేస్తున్నారు. మార్జిన్ ఫర్ ఎర్రర్ చాలా తక్కువగా ఉండటంతో, ఇకపై జరిగే చిన్న పొరపాటు కూడా జట్టును టోర్నీ నుంచి నిష్క్రమించేలా చేయనుంది. మరోవైపు అభిమానులు మాత్రం తమ సీఎస్‌కే ఎలాగైనా మరోసారి అద్భుతం చేసి ప్లేఆఫ్స్‌కు చేరుతుందని ఆశిస్తున్నారు.

అచ్చం ధోనినే...గన్-షాట్ సెలబ్రేషన్ చేసిన CSK ఆట‌గాడు

Next Story