హాకీ ఉత్తమ ప్లేయర్లుగా హార్దిక్, నవ్‌నీత్ కౌర్‌లకు అవార్డులు

by Harish |

హాకీ ఉత్తమ ప్లేయర్లుగా హార్దిక్, నవ్‌నీత్ కౌర్‌లకు అవార్డులు
X

దిశ, స్పోర్ట్స్ : 2025కు సంబంధించిన హాకీ ఇండియా వార్షిక అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలో శుక్రవారం జరిగింది. ప్రతిష్టాత్మక బల్బీర్ సింగ్ సీనియర్ అవార్డు(ప్లేయర్ ఆఫ్ ది ఇయర్) పురుషుల విభాగంలో హార్దిక్ సింగ్, మహిళల విభాగంలో నవ్‌నీత్ కౌర్‌లను వరించింది. హార్దిక్ ఉత్తమ ప్లేయర్‌ అవార్డు గెలవడం ఇది మూడోసారి కావడం విశేషం. ఇంతకుముందు 2022, 2023‌లలో అవార్డు దక్కింది. దిగ్గజ ప్లేయర్, ఒలింపిక్ మెడలిస్ట్ జాఫర్ ఇక్బాల్‌ను హాకీ ఇండియా మేజర్ ధ్యాన్‌‌చంద్ లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించింది. 1980‌ మాస్కో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన భారత జట్టులో ఆయన సభ్యుడు. అలాగే, గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు బిచు దేవి ఖరిబమ్ సొంతమైంది. డిఫెండర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు సంజయ్‌ను, మిడ్ ఫీల్డర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు సుమిత్‌ను, ఫార్వార్డ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు సుఖ్‌జీత్ సింగ్‌లను వరించాయి. అండర్-21 పురుషుల, మహిళల విభాగాల్లో అప్‌కమింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు జుగ్‌రాజ్ సింగ్, సాక్షి రాణా గెలిచారు.


Next Story