- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
116 ఏళ్ల తర్వాత యాషెస్ సిరీస్ లో సరికొత్త చరిత్ర..ఏకంగా 19 వికెట్లు
యాషెస్ సిరీస్ 2025-26 టోర్నమెంట్ చాలా గ్రాండ్ గా శుక్రవారం ప్రారంభమైంది.

దిశ, వెబ్ డెస్క్: యాషెస్ సిరీస్ 2025-26 టోర్నమెంట్ చాలా గ్రాండ్ గా శుక్రవారం ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్, మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో పెర్త్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఫస్ట్ బౌలింగ్ చేసింది. ఈ తరుణంలో కంగారుల పవర్ఫుల్ బౌలింగ్ కు ఇంగ్లాండ్ 32.5 ఓవర్లలో 172 పరుగుల వద్ద అలౌట్ అయింది. ఆస్ట్రేలియా డేంజర్ బౌలర్ మిచెల్ స్టార్క్ ( Mitchell Starc ) 13 ఓవర్లు వేసి ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టాడు. బ్రెండన్ డాగెట్
రెండు వికెట్లు తీయగా గ్రీన్ ఒక వికెట్ పడగొట్టాడు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా కూడా ఇదే బాట పట్టింది. 39 ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా, తొమ్మిది వికెట్లు నష్టపోయి కేవలం 123 పరుగులు మాత్రమే సాధించింది. ఇక అప్పటికే మొదటి రోజు పూర్తయింది. ఫస్ట్ డే ముగిసే సమయానికి ఇంగ్లాండ్ కంటే 49 పరుగులు వెనుక బడే ఆస్ట్రేలియా ఉంది. ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 5 వికెట్లు పడగొట్టాడు. బ్రైడాన్ కార్స్ రెండు వికెట్లు తీయగా జోఫ్రా ఆర్చర్ మరో రెండు పడగొట్టాడు. దీంతో ఇప్పుడు ఇంగ్లాండ్ పైచేయి సాధించింది. 1909 నుంచి అంటే 116 ఏళ్ల తర్వాత చూసుకున్నట్లయితే, ఒకే రోజున యాషెస్ సిరీస్ లో ఏకంగా 19 వికెట్లు పడగొట్టడం ఇదే తొలిసారి అని సమాచారం.






