- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
WPL 2026: రూ.2.4 కోట్లు పలికిన కరీంనగర్ క్రికెటర్
అంతర్జాతీయ మహిళా వెటరన్ క్రికెటర్, కరీంనగర్ జిల్లాకు చెందిన శిఖా పాండేకు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 వేలంలో భారీ ధర

దిశ, వెబ్ డెస్క్: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కు సంబంధించిన మెగా వేలం తాజాగా జరిగింది. గురువారం మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ఢిల్లీ వేదికగా ఈ మెగా వేలం చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. ఇందులో కొంతమంది ప్లేయర్లకు బంపర్ ఆఫర్లు తగులగా, మరి కొంతమంది ప్లేయర్లకు నిరాశ ఎదురయింది. ఈ నేపథ్యంలో కరీంనగర్ క్రికెటర్ కు దాదాపు రూ.2.4 కోట్లు దక్కాయి.
అంతర్జాతీయ మహిళా వెటరన్ క్రికెటర్, కరీంనగర్ జిల్లాకు చెందిన శిఖా పాండేకు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 వేలంలో భారీ ధర వచ్చింది. శిఖా పాండేను ఏకంగా రూ. 2.4 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ వేలంలో 36 సంవత్సరాలు ఉన్న శిఖా పాండే 40 లక్షల బేస్ ధరతో బరిలోకి దిగారు. అయితే శిఖా పాండే ప్రదర్శన నేపథ్యంలో యూపీ వారియర్స్ జట్టు రూ. 2.4 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. దీంతో దేశవ్యాప్తంగా శిఖా పాండే పేరు మారుమవుతోంది. గతంలో 2.2 కోట్లు పలికిన ఆమె ఇప్పుడు మరో రూ.20 లక్షలు పలికారు. కాగా రామగుండం ఎన్టీపీసీ ఉద్యోగి కుమార్తె అయిన శిఖా పాండే రెండు సంవత్సరాలుగా అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉంటున్నారు. అయినప్పటికీ శిఖా పాండేపై కోట్ల వర్షం కురవడం గమనార్హం.
ఇది ఇలా ఉండగా, మహిళ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ వేలంలో దీప్తి శర్మకు మంచి ధర దక్కింది. ఆమెను 3.2 కోట్లకు యూపీ వారియర్స్ దక్కించుకుంది. దీంతో ఈ మెగా వేలంలో దీప్తి శర్మ ఖరీదైన ప్లేయర్ గా రికార్డు సృష్టించింది. RTM ప్రక్రియ ద్వారా దీప్తి శర్మను యూపీ వారియర్స్ మరోసారి సొంతం చేసుకుంది. అయితే ఈ మహిళల ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో స్మృతి మందాన ఇప్పటి వరకు అత్యధిక ధర పలికి రికార్డు సృష్టించారు. 3.4 కోట్లకు స్మృతి మందానను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గతంలోని కొనుగోలు చేసింది. ఇక ఇప్పుడు ఆమె తర్వాత దీప్తి శర్మ రెండో స్థానంలో నిలిచింది.






