- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు ఆర్సీబీ, ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్.. టాప్-2లో ఉండాలంటే సన్‌రైజర్స్ ఎన్ని రన్స్ తేడాతో గెలవాలో తెలుసా?

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. అయితే, ఎస్‌ఆర్‌హెచ్ టాప్-2 పొజిషన్‌పై కన్నేసింది. ప్రస్తుతం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 18 పాయింట్స్, +1.1065 నెట్ రన్‌రేటుతో అగ్రస్థానంలో ఉంది. గుజరాత్ టైటాన్స్ 18 పాయింట్స్, +0.695 నెట్‌రన్‌రేటుతో రెండో స్థానంలో ఉంది. ఇక, సన్‌రైజర్స్(16 పాయింట్స్, +0.083 నెట్‌రన్‌రేటు) మూడో స్థానంలో ఉంది. నేడు ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ జట్టు తమ చివరి గ్రూపు మ్యాచ్‌లో ఆర్సీబీతో తలపడనుంది. ఈ గేములో అసాధారణ ప్రదర్శన చేస్తే హైదరాబాద్ టాప్-2లో నిలవొచ్చు. ఆర్సీబీపై మామూలుగా గెలిచినా మూడో స్థానంతోనే సరిపెట్టాల్సి ఉంటుంది. భారీ విజయం సాధిస్తేనే టాప్-2లో చోటు దక్కుతుంది. నేటి మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ముందుగా బ్యాటింగ్ చేస్తే 200 లేదా 220 రన్స్ చేయాల్సి ఉంటుంది. 88 లేదా 87 పరుగులతో గెలవాలి. ఒకవేళ ఆర్సీబీ ముందుగా బ్యాటింగ్ చేస్తే ఆ జట్టును 150లోపే కట్టడి చేయాలి. ఆ లక్ష్యాన్ని సన్‌రైజర్స్ 11.1 నుంచి 11.3 ఓవర్లలో చేజ్ చేయాలి. అప్పుడు మాత్రమే ఎస్‌ఆర్‌హెచ్ టాప్-2లో ఉంటుంది. అయితే, సూపర్ ఫామ్‌లో ఉన్న ఆర్సీబీపై భారీ విజయాన్ని నమోదు చేయడం అంటే అంత సులభం కాదు. మైదానంలో కచ్చితమైన ప్రణాళికలతో బరిలోకి దిగి.. అన్ని విభాగాల్లోనూ సత్తాచాటితేనే బెంగళూరును కట్టడి చేయొచ్చని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. టాప్-2లో నిలిచిన జట్లు క్వాలిఫయర్-1లో తలపడగా గెలిచిన జట్టు నేరుగా టైటిల్ పోరుకు వెళ్తుంది. ఓడినా జట్టుకు ఫైనల్‌కు వెళ్లేందుకు క్వాలిఫయర్-2 ద్వారా మరో చాన్స్ ఉంటుంది






