BCCI కి హైకోర్టు షాక్

by Muthe.Rajitha |

బీసీసీఐ(BCCI)కి ముంబై హైకోర్ట్(Mumbai High Court) భారీ షాకిచ్చింది.

BCCI కి హైకోర్టు షాక్
X

దిశ, వెబ్ డెస్క్ : బీసీసీఐ(BCCI)కి ముంబై హైకోర్ట్(Mumbai High Court) భారీ షాకిచ్చింది. ఐపీఎల్(IPL) నుంచి కొచ్చి టస్కర్(Kochi Tusker) ను సస్పెండ్ చేయడాన్ని హైకోర్ట్ తీవ్రంగా తప్పు పట్టింది. 2011 లో ఐపీఎల్ నుంచి అర్థాంతరంగా కొచ్చి జట్టును పక్కన పెట్టడంపై బీసీసీఐని నిలదీసింది. సస్పెండ్ చేసేంత నేరం ఆ జట్టు ఏం చేసిందని ప్రశ్నించింది. తక్షణమే కొచ్చి టస్కర్ ఫ్రాంచైజీకి రూ.538 కోట్లు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

అయితే 2011 లో కేరళ ఫ్రాంచైజీ అయిన కొచ్చి టస్కర్ బ్యాంకు గ్యారంటీ చెల్లించలేదనే కారణంతో బీసీసీఐ ఐపీఎల్ నుంచి ఆ జట్టును పక్కన పెట్టింది. దీనిపై కొచ్చి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. సుధీర్ఘ విచారణ అనంతరం హైకోర్ట్ నేడు తుది తీర్పు వెల్లడించింది.

Next Story