పంత్ అందరిలా కాదు.. భిన్నమైన ప్లేయర్ : రవిశాస్త్రి

by Harish |

ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో సూపర్ సెంచరీ చేసిన టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పై మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు.

పంత్ అందరిలా కాదు.. భిన్నమైన ప్లేయర్ : రవిశాస్త్రి
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో సూపర్ సెంచరీ చేసిన టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పై మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. బీసీసీఐ టీవీతో శాస్త్రి మాట్లాడుతూ.. పంత్ మ్యాచ్ గమనాన్ని మార్చే ప్లేయర్ అని ప్రశంసించాడు. ‘అతను దారుణమైనవాడు. తొలి రోజు నుంచి అతన్ని చూస్తున్నా. అందరికంటే భిన్నమైనవాడు. అతను తనకు నచ్చినట్టు ఆడతాడు. కొన్ని సార్లు పరుగుల కోసం ఆడతాడు. కొన్ని సార్లు తన మనసు చెప్పిందే చేస్తాడు. 5వ స్థానంలో అతను నిలకడగా రాణిస్తున్నాడు.’అని తెలిపాడు. అలాగే, తాను ఎదుర్కొన్న రెండో బంతినే పంత్ ఫోర్ కొట్టడంపై శాస్త్రి స్పందిస్తూ.. అది ప్రత్యర్థికి వార్నింగ్ ఇవ్వడంలాంటిందన్నాడు. రెండో బంతినే బౌండరీ కొట్టడం సాధారణ విషయం కాదని, అలా ఎంత మంది చేయగలరని చెప్పుకొచ్చాడు.


Next Story