IND VS ENG : కోహ్లీకి ఏమైంది?.. ఇంగ్లాండ్‌తో తొలి వన్డేకు ఎందుకు దూరమయ్యాడంటే?

by Harish |   ( Updated:2025-02-06 12:53:12.0  )
IND VS ENG : కోహ్లీకి ఏమైంది?.. ఇంగ్లాండ్‌తో తొలి వన్డేకు ఎందుకు దూరమయ్యాడంటే?
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గాయపడ్డాడు. దీంతో ఇంగ్లాండ్‌తో తొలి వన్డేకు దూరమయ్యాడు. మ్యాచ్‌కు ముందు బీసీసీఐ ఈ విషయాన్ని వెల్లడించింది. కోహ్లీ కుడి మోకాలి నొప్పితో బాధపడుతున్నట్టు వెల్లడించింది. అందుకే, అతను తొలి వన్డే కోసం సెలెక్షన్‌కు అందుబాటులో లేడని తెలిపింది. కోహ్లీ ఆడకపోవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. కొంతకాలంగా విరాట్ ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. చాంపియన్స్ ట్రోఫీకి ముందు జరుగుతున్న ఈ సిరీస్‌ ఫామ్ అందుకోవడానికి అతనికి చాలా ముఖ్యం. అయితే, గాయం కారణంగా తొలి వన్డేకు దూరమయ్యాడు. మిగతా రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడో లేదా చూడాలి?. కోహ్లీ చివరిసారిగా గతేడాది ఆగస్టులో శ్రీలంకపై చివరి వన్డే ఆడాడు.

వన్డేల్లోకి జైశ్వాల్, హర్షిత్ అరంగేట్రం

యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్, పేసర్ హర్షిత్ రాణా వన్డే క్రికెట్‌లో అరంగేట్రం చేశారు. కోహ్లీ దూరమవడంతో జైశ్వాల్‌కు తుది జట్టులో చోటు దక్కింది. 2023లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన అతను టెస్టు, టీ20 జట్లలో కీలక ఆటగాడిగా మారాడు. తాజాగా ఇంగ్లాండ్‌పై వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. మరోవైపు, హర్షిత్ రాణాగతేడాది ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్‌ ట్రోఫీలో టెస్టుల్లోకి, ఇటీవల ఇంగ్లాండ్‌పై టీ20ల్లోకి అడుగుపెట్టాడు. తాజాగా వన్డే జట్టులో చోటు సంపాదించాడు. కెప్టెన్ రోహిత్ చేతుల మీదుగా జైశ్వాల్ వన్డే క్యాప్ అందుకోగా.. హర్షిత్ రాణాకు స్టార్ పేసర్ షమీ వన్డే క్యాప్ అందజేశాడు.


Next Story

Most Viewed