- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
2025 సగం కాలేదు.. 15 మంది క్రికెటర్లు రిటైర్మెంట్!
క్రికెట్ చరిత్రలో 2025 రిటైర్మెంట్ ఇయర్ గా మారబోతుందని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. 2025 సంవత్సరంలో

దిశ, వెబ్ డెస్క్: క్రికెట్ చరిత్రలో 2025 రిటైర్మెంట్ ఇయర్ గా మారబోతుందని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. 2025 సంవత్సరంలో రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే 15 మంది క్రికెటర్లు.. గడిచిన ఆరు నెలల్లోనే రిటైర్మెంట్ ప్రకటించారు. ఇంకో ఆరు నెలల సమయం ఈ సంవత్సరంలో ఉంది. ఆ లోపు ఇంకెంత మంది క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటిస్తారో ? అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
2025 లో రిటైర్మెంట్ ప్రకటించిన ప్లేయర్లు
2025 సంవత్సరంలో... విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ ఇద్దరు ప్లేయర్లు ఇప్పటికే t20 లకు రిటైర్మెంట్ ప్రకటించగా... నెల కిందట టెస్టులకు కూడా రిటైర్మెంట్ ఇచ్చారు. అలాగే మ్యాక్సీ మామ, స్టీవెన్ స్మిత్ , స్టోయినిస్ ముగ్గురు కూడా వన్డేలకు రిటైర్మెంట్ ఇచ్చారు. క్లాసెన్, పూరన్ ఇద్దరు కూడా తాజాగా అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పి కేవలం ఐపిఎల్ లాంటి టోర్నమెంట్లు ఆడబోతున్నారు. అలాగే వరుణ్ ఆరోన్, తమీమ్ ఇక్బాల్, షాపూర్ జద్రాన్, వృద్ధిమాన్ సాహా, దిముత్ కరుణరత్నే, మహ్మదుల్లా, ముష్ఫికర్ రహీమ్, ఏంజెలో మాథ్యూస్ 2025 సంవత్సరంలోనే రిటైర్మెంట్ ఇచ్చారు.






