- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్లాసెన్‌కు భారీ షాక్.. ఇంటర్నేషనల్ కెరీర్ ప్రశ్నార్థకం?
సన్‌రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర ఆటగాడు, సౌతాఫ్రికాకు చెందిన హెన్రిచ్ క్లాసెన్‌కు భారీ షాక్ తగిలింది.

దిశ, స్పోర్ట్స్ : సన్‌రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర ఆటగాడు, సౌతాఫ్రికాకు చెందిన హెన్రిచ్ క్లాసెన్‌కు భారీ షాక్ తగిలింది. దక్షిణాఫ్రికా జాతీయ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో అతనికి చోటు దక్కలేదు. సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు 2025-26కు సంబంధించిన జాతీయ కాంట్రాక్ట్ జాబితాను సోమవారం రిలీజ్ చేసింది. 18 మంది సెంట్రల్ కాంట్రాక్ట్‌లో చేర్చగా.. క్లాసెన్‌పై వేటు వేశారు. టీ20 క్రికెట్‌లో స్పెషలిస్ట్ బ్యాటర్‌గా గుర్తింపు పొందిన క్లాసెన్‌కు సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కకపోవడంతో అతని భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం క్లాసెన్ ఐపీఎల్‌తో బిజీగా ఉన్నాడు. డేవిడ్ మిల్లర్, రస్సీ వాన్ డెర్ డస్సెన్‌లకు హైబ్రిడ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. వారు ఎంపిక చేసిన సిరీస్‌లు మాత్రమే ఆడతారు. యువ పేసర్లు క్వెనా మఫాకా, లిజాడ్ విలియమ్స్, ఆల్‌రౌండర్ సెనూరన్ ముత్తుసామి తొలిసారిగా జాతీయ కాంట్రాక్ట్ పొందారు. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్, వన్డే వరల్డ్ కప్-2027ను దృష్టి పెట్టుకుని ఆటగాళ్లను సెలెక్ట్ చేసినట్టు సౌతాఫ్రికా జట్టు డైరెక్టర్ ఇనోచ్ ఎన్‌క్వే తెలిపారు.
- Tags
- Klaasen






