రిటైర్మెంట్ తీసుకోక తప్పలేదు.. హెన్రిచ్ క్లాసెన్ షాకింగ్ స్టేట్‌మెంట్

by Gantepaka Srikanth |

సౌతాఫ్రికా(South Africa) స్టార్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్(Heinrich Klaasen) అంతర్జాతీయ క్రికెట్ కెరియర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

రిటైర్మెంట్ తీసుకోక తప్పలేదు.. హెన్రిచ్ క్లాసెన్ షాకింగ్ స్టేట్‌మెంట్
X

దిశ, వెబ్‌డెస్క్: సౌతాఫ్రికా(South Africa) స్టార్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్(Heinrich Klaasen) అంతర్జాతీయ క్రికెట్ కెరియర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. టెస్టులు, వన్డేలు, టీ20లు ఇలా అన్ని ఫార్మాట్లకు ఒకేసారి గుడ్ బై చెప్పారు. క్లాసెన్ రిటైర్మెంట్ ప్రకటన సౌతాఫ్రికా క్రికెట్ అభిమానులతో పాటు హైదరాబాద్‌లోని ఆయన ఫ్యాన్స్‌ను చాలా తీవ్రంగా బాధించింది. అయితే రిటైర్మెంట్ వెనుక చాలా పెద్ద స్టోరీ ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా తాను ఎందుకు రిటైర్మెంట్ తీసుకోవాల్సి వచ్చిందో చెప్పారు. రాబ్ వాల్టర్ దక్షిణాఫ్రికా హెడ్‌ కోచ్‌గా వైదొల‌గ‌డం, సెంట్ర‌ల్ కాంట్రాక్ట్‌లో త‌న పేరు లేక‌పోవ‌డంతోనే రిటైర్మెంట్ నిర్ణ‌యానికి వ‌చ్చాన‌ని వెల్లడించాడు. తాను 2027 వన్డే ప్రపంచకప్‌ వరకూ ఆడాలని అనుకున్నాను. కానీ మా బోర్డు (South African Cricket Board)లోని రాజకీయాలతో విసిగిపోయాను. హెడ్‌కోచ్‌గా వాల్టర్ ఉన్నన్ని రోజులు అంతా బాగుండేది. కానీ అతడు కోచ్‌ పోస్టు నుంచి వైదొలగడంతో పాటు.. సెంట్ర‌ల్ కాంట్రాక్ట్‌లో నాకు చోటుద‌క్క‌క‌పోవ‌డం న‌న్ను హర్ట్ చేశాయి. తప్పక రిటైర్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది అని క్లాసెన్ చెప్పుకొచ్చారు.

Next Story