- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, స్పోర్ట్స్ : సౌతాఫ్రికా వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్‌కు ఐసీసీ జరిమానా విధించింది. గురువారం పాకిస్తాన్‌తో కెప్ టౌన్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో ఔట్ అయిన తర్వాత వికెట్లను క్లాసెన్ తన్నాడు. దీంతో ఐసీసీ క్లాసెన్ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించింది. లెవల్ 1 ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను క్లాసెన్ ఉల్లంఘించినట్లు ఐసీసీ తెలిపింది. ఆర్టికల్ 2.2 ఐసీసీ కోడ్ ప్రకారం క్రికెట్ పరికరాలు, దుస్తువులను దుర్వినియోగం చేసినట్లు నిర్ధారించింది. ఒక డీ మెరిట్ పాయింట్‌ను విధించింది. ఆన్ ఫీల్డ్ అంపైర్లు అలెక్స్ వార్ఫ్, లుబబలో, థర్డ్ అంపైర్ నితిన్ మీనన్, ఫోర్త్ అంపైర్ అల్లాహుద్దీన్ పాలెకర్ ఈ మేరకు అభియోగాలు మోపారు. క్లాసెన్ జరిమానాకు అంగీకరించినట్లు మ్యాచ్ రెఫరీ రిచీ రిచర్డ్ సన్ వెల్లడించాడు. అయితే ఈ మ్యాచ్‌లో క్లాసెన్ 74 బంతుల్లో 97 పరుగులు చేశాడు. పాకిస్తాన్ పాకిస్తాన్ సౌతాఫ్రికాపై 81 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 329 పరుగులు చేసింది. సౌతాఫ్రికా 43.1 ఓవర్లలో 248 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
అఫ్గాన్ ఫాస్ట్ బౌలర్ ఫరుఖీకి..
అఫ్గాన్ ఫాస్ట్ బౌలర్ ఫరుఖీకి ఐసీసీ జరిమానా విధించింది. గురువారం హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో ఫరుఖీ లెవల్ 1 కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించినట్లు ఐసీసీ వెల్లడించింది. ఇందుకు అతని మ్యాచ్ ఫీజులు 15 శాతం జరిమానాగా విధించినట్లు తెలిపింది. అంపైర్ నిర్ణయం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఫరుఖీకి ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.8 నియామవళి కింద ఈ మేరకు చర్యలు తీసుకుంది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా మ్యాచ్ ఫీజులో కోతతో పాటు ఒక డీ మెరిట్ పాయింట్‌ను విధించినట్లు తెలిపింది. ఆన్ ఫీల్డ్ అంపైర్లు క్రిస్ బ్రౌన్, పెర్సివల్ సిజారా, థర్డ్ అంపైర్లు లాంగ్‌టన్ రుసెరె, ఫోర్త్ అంపైర్ ఇక్నో చాబి ఈ మేరకు అభియోగాలు మోపారు. ఫజల్‌హక్ ఫరుఖీ జరిమానాకు ఒప్పుకున్నాడని ఎమిరేట్స్ ఐసీసీ ఎలైట్ ప్యానెల్ మ్యాచ్ రెఫ్రీ ఆండీ పిక్రాఫ్ట్ తెలిపాడు.






